కాల్పులు జరిపిన వ్యక్తి నాకు తెలియదు: నిత్యానందరెడ్డి

 

హైదరాబాద్‌ కేబీఆర్ పార్కు దగ్గర తనమీద కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అయితే అతన్ని మరోసారి చూస్తే మాత్రం తప్పకుండా గుర్తుపడతానని అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి చెప్పారు. ‘‘నామీద కాల్పులు జరిపిన వ్యక్తి వయసు 30 సంవత్సరాలు వుంటుంది. అతను ఎవరో నాకు తెలియదు. గతంలో ఎప్పుడూ చూడలేదు. నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఈ కాల్పుల సంఘటన వెనుక ఎవరున్నారన్న విషయాన్ని నేను ఊహించలేను’’ అని నిత్యానందరెడ్డి అన్నారు. నిత్యానందరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులలో ఒక నిందితుడిగా వుండటం గమనార్హం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu