కేంద్ర‌మంత్రి యూట్యూబ్ ఇన్‌క‌మ్ నెల‌కు 4 ల‌క్ష‌లు.. ఎలాగంటే...!

సెల‌బ్రిటీలు ఏం చేసినా ఫుల్ పైస‌ల్ వ‌స్తాయ్‌. సోష‌ల్ మీడియాలో వాళ్ల‌కు ఫుల్‌గా ఫాలోవ‌ర్స్ ఉంటారు కాబ‌ట్టి.. వారో ఏ పోస్ట్ పెట్టినా ల‌క్ష‌ల్లో వ్యూస్, లైక్స్‌ ఉంటాయి. అందుకే, సినీ సెలట్రిటీస్ సోషల్ మీడియా ఇన్‌క‌మ్ భారీగానే ఉంటుంది. కానీ, సినీ స్టార్స్‌తో పోలిస్తే పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కు సోష‌ల్ మీడియాలో అంత‌గా క్రేజ్ ఉండ‌దు. ఫాలోయ‌ర్స్ ఉంటారు కానీ, వారు చెబితే ఆచ‌రించే టైప్ ఫ్యాన్స్ త‌క్కువ‌. అందుకే, రాజ‌కీయ నాయ‌కులు వారి ఎజెండాను ప్ర‌చారం చేసుకోవ‌డానికి మాత్ర‌మే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ యూజ్‌ఫుల్‌. అంతేకానీ, వాటి నుంచి లీడ‌ర్స్ ఎలాంటి ఇన్‌క‌మ్ ఎక్స్‌పెక్ట్ చేయ‌రు. కానీ, కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ మాత్రం సంథింగ్ స్పెష‌ల్‌. ఆయ‌న త‌న యూట్యూబ్ ఛానెల్ నుంచి దండిగా సంపాదిస్తున్నారు. ఏకంగా నెల‌కు 4 ల‌క్ష‌ల రాబ‌డి ఆర్జిస్తున్నారు. యూట్యూబ్ నుంచి మంత్రీ ఫోర్ లాక్స్ అంటే మామూలు విష‌యం కాదు. కేంద్ర‌మంత్రికి యూట్యూబ్ బాగానే గిట్టుబాటు అయిన‌ట్టుంది. ఇంత‌కీ ఆ ఆదాయం ఎలా వ‌స్తోందంటే...

యూట్యూబ్‌ తనకు ప్రతి నెలా 4లక్షలు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీనే స్వ‌యంగా వెల్లడించారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో తాను ఇంట్లోనే ఉండి లక్షల రూపాయాలు ఆర్జించానన్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లో ఖాళీగా ఉండ‌లేక రెండు రకాల పనులు చేశానని చెప్పారు. అవే త‌న‌కు ఇంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయ‌ని అన్నారు. అవి ఏంటంటే...

లాక్‌డౌన్ టైమ్‌లో కేంద్ర‌మంత్రి చెఫ్ అవ‌తారం ఎత్తారు. స‌ర‌దాగా ఇంట్లో వంట చేశారు. ఆ వీడియోల‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అలాగే, వంట అయ్యాక మిగ‌తా టైమ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపాన్యాసాలు ఇచ్చారు. విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, తదితరులకు ఆన్‌లైన్‌లో స్పీచ్‌లు ఇచ్చారు. ఇలా ఒక‌టి రెండూ కాదు.. దాదాపు 950కి పైగా ఉపన్యాసాలు ఇచ్చారు. అలా తానిచ్చిన ప్ర‌సంగాల‌న్నిటినీ యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 

ఇటు వంట‌ల వీడియోలు, అటు గెస్ట్ లెక్చ‌ర్స్ వీడియోలు.. ఇలా కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఫీడ్‌కు భారీగా వ్యూస్ వ‌స్తున్నాయి. ఆ వీడియోలు వైర‌ల్‌గా మారాయి. గ‌డ్క‌రీ వీడియోల‌కు వ్యూయ‌ర్‌షిప్ భారీగా పెర‌గ‌డంతో యూట్యూబ్ నుంచి డ‌బ్బులు కూడా బాగానే వ‌స్తున్నాయి. యూట్యూబ్ నుంచి నెల‌కు 4 ల‌క్ష‌ల ఆదాయం వ‌స్తోంద‌ట నితిన్ గ‌డ్క‌రీకి. లాక్‌డౌన్‌లో భ‌లే మంచి బేరం క‌దా....