మంత్రులు, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ వార్నింగ్‌.. అందుకే అలా చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్నారా? ప్రభుత్వ పథకాల అమమలులో అవకతవకలు, పధకాలు, లబ్దిదారుల కుదింపు. అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో రోజు రోజుకు దిగాజారి పోతున్న శాంతి భద్రతలు, జడలు విప్పిన అవినీతి, అక్రమాలలు, మహిళలకు, చిన్నారులకు భద్రత‌లేని పరిస్థితి, పెరిగిపోతున్న మాన-భంగాలు, హత్యలు, హత్యాచారాలు  ఇలా అనేక విషయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కడుతూ ప్రతిపక్షాలు, ప్రధానంగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అదే విధంగా బీజేపీ, జనసేన పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు శ్రద్ద చూపడం లేదని, చివరకు తమ శాఖలకు సంబంధించి వస్తున్న అవినీతి ఆరోపణలకు కూడా సంబంధిత శాఖల మంత్రులు సమాదానం ఇవ్వక పోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

ఈమ‌ధ్యే జ‌రిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి.. సీనియర్ మంత్రులు సహా మంత్రులు అందరికీ గట్టిగా క్లాసు తీసుకున్నారని అంటున్నారు. విపక్షాలు చేసిన విమర్శలకు సరైన రీతిలో సమాధానం ఇవ్వకపోతే, ప్రజలు.. ప్రతిపక్షాల విమర్శలే నిజం అనుకునే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే, సమస్యల విషయంలో మంత్రుల నిర్లక్ష్య ధోరణి., అసమర్ధత వలన ప్రభుత్వ ప్రతిష్ట దినదినం దిగజారి పోతోందని, ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం. మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల పనితీరు పట్ల కూడా ముక్జ్హ్యమంత్రి జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తహం చేసినట్లు సమాచారం. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనంలోకి  వెళ్లి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటైన సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలుస్తోంది.
 
అయితే, మంత్రులు, పార్టీ నాయకులు మరో వాదన చేస్తున్నారు.  ప్రజల్లోకి వెళితే, ప్రతిపక్షాల కంటే గట్టిగా ప్రజలే ప్రభుత్వ వైఫల్యాలను, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల ఇసుక. మధ్య దందా,  అవినీతి అక్రమాలను  ఎత్తి చుతున్నారని అంటున్నారు. విద్యుత్ ఛార్జీల మోతకు గత ప్రభుత్వం కారణమని చెపితే ప్రజలు నవ్వుతున్నారని అంటున్నారు. అలాగే, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం నేరాలు పెరిగి పోవడం వంటి విషయాలలో ప్రజలు నిలదీస్తున్నారని, ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు అందక పోవడంతో అవమానాలు ఎదుర్కోనవలసి వస్తోందని అంటున్నారు. 

అదలా ఉంటె ముఖ్యమంత్రి మంత్రి వర్గ సమావేశం సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు మినహా మిగిలివ వారంతా పార్టీ బాధ్యతలకు సిద్దం కావాలని, మంత్రి వర్గంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నానని ముఖ్యమంత్రి స్పష్టం  చేశారని అంటున్నారు. అలాగే, ఎమ్మెల్సీలకు మంత్రి వర్గంలో స్థానం ఉండదని కూడా సీఎం చెప్పారని అంటున్నారు. కాగా, బద్వేల్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా తెలిపినట్లు సమాచారం. 

మంత్రులకు ముఖ్యమంత్రికి మొదటి నుంచి ఉన్న దూరం ఇప్పడు మరింతగా పెరిగిందని. అసహనం, సంతృప్తి మరింతగా పెరుగుతున్నాయని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, 2024 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలిపించే బాధ్యతను మరోమారు, ప్రశాంత్ కిశోర్ బృందానికి అప్పగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇంతవరకు, తమ అద్బుత పాలన చూసి ప్రజలు మళ్ళీ తమకే పట్టం కడతారనే భ్రమల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, పీకే శరణు వేడుతున్నాంటే, అది ఆయనలో రెండున్నర ఏళ్లు ముందుగా మొదలైన ఓటమి భయానికి ఫ్రస్ట్రేషన్’కు నిదర్శనమని అంటున్నారు.

ముఖ్య‌మంత్రి హెచ్చ‌రిక‌ల‌తోనే అయ్య‌న్న‌పాత్రుడి వ్యాఖ్య‌ల విష‌యంలో వైసీపీ నేత‌లు ఓవ‌రాక్ష‌న్‌కు దిగార‌ని.. జ‌గ‌న్ ముందు మార్కులు కొట్టేసి, మంత్రి ప‌ద‌వి కొట్టేసేందుకే ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటిపై దాడి చేశార‌ని అంటున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌తో ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల్లో అబాసుపాల‌వుతుంది కానీ, టీడీపీకి పోయేదేమీ లేద‌నే లాజిక్ మ‌ర్చిపోతున్నార‌ని మండిప‌డుతున్నారు. ఓట‌మి భ‌యంతో వైసీపీ శ్రేణులు ఇలాంటి దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని ఆరోపిస్తున్నారు.