అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..తొమ్మండుగురు మృతి
posted on Jul 14, 2025 8:59AM
.webp)
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డి పల్లె కట్టపస మామిడికాయల లోడ్ తో వెడుతున్న లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని రాజంపేట, తిరుపతి ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు.
గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 18 మంది ఉన్నారు. మృతులూ, క్షతగాత్రులు కూడా మామాడి కోసే ఈ ప్రమాదంతో కడప, తిరుపతి మార్గంలో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. బోల్తాపడిన లారీని క్రేన్ సాయంతో పక్కకు తీసి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. పుల్లంపేట పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.