పార్లమెంట్ వద్ద సైకిల్‌పై సందడి చేసిన బాలయ్య
posted on Jul 31, 2025 4:25PM

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద సందడి చేశారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తీసుకొచ్చిన సైకిల్‌పై కూర్చొని కెమెరాకు పోజులిచ్చారు. సైకిల్‌ను చూసిన బాలయ్య అన్న ఎన్టీఆర్, వారి అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రతీకగా పార్లమెంట్‌కు రావడం అభినందనీయం అని బాలయ్య ప్రశంసించినట్టు అప్పలనాయుడు ట్వీట్ చేశారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్టీ ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను బాలయ్య కలిశారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్, హరిదీప్ సింగ్ పురీ, మన్ సుఖ్ మండవీయలను బాలకృష్ణ కలవనున్నారు. ప్రతి తెలుగోడు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆరోజు అన్న ఎన్టీఆర్ పెట్టిన టిడిపి పార్టీ గుర్తు సైకిల్ పై పార్లమెంటుకు రావడం అనేది అభినందనీయకమని బాలయ్య పేర్కొన్నారు.
అలాగే మన పార్టీ ప్రాముఖ్యతను భారతదేశం అంతా తెలిపే విధంగా మన పార్టీ సింబల్ సైకిల్ ను పార్లమెంట్ ప్రవేశ ద్వారం పక్కన ఒక సిగ్నిఫికెన్స్ గా ఉండటం హర్షనీయమని చెబుతూ, అలాగే పక్కన ఉన్న సహచర ఎంపీ ద్వారా రోజు పార్లమెంటుకు సైకిల్ పై వస్తున్న విషయం తెలుసుకొని ఎంపీ చేస్తున్న పనిని ప్రశంసిస్తూ, పార్లమెంట్ లో మీ గళం ద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి అంటూ, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ మీ పై సదా ఉంటాయని వారి అభిమానాన్ని ఎంపీ పై చూపిస్తూ ఇకముందు కూడా ఇలాగే ముందుకు సాగండి అని వారిని అభినందించి కాసేపు సరదాగా సైకిల్ పై కూర్చుని, ఫోటోలు ఇస్తూ సరదాగా కాసేపు ఢిల్లీ విషయాలపై సంభాషించారని ఎంపీ కలిశెట్టి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు