వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.  ఓ మహిళ ఫిర్యాదుతో కోవూరు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశముంది. ప్రసన్నకుమార్ రెడ్డి తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సంఘటనతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సభ్య సమాజం తలదించుకునేలా తనపై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ అండగా నిలిచిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.