ముర్మూ ఎంట్రీతో మారిన సమీకరణలు ఇరకాటంలో విపక్షాలు

రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. అది రాష్ట్రపతి ఎన్నికే అయినా, అయినా మరో వివాదం అయినా,  రాజకీయ పార్టీలు రాజకీయం కాకుండా ఇంకేదో చేస్తాయని అనుకోవడం, అయితే, అజ్ఞానం, కాదంటే అవివేకం అవుతుందే కానీ, విజ్ఞత అనిపించుకోదు.అందుకు బీజేపే మినహాయింపు కాదు. అవును ఒకప్పుడు, బీజేపే, ఇతర పార్టీలకు భిన్నంగా, విలువలకు విలువ ఇచ్చే పార్టీగా మడికట్టుకు కూర్చున్న మాట కొంతవరకు నిజమే కావచ్చును,కానీ, ఇప్పుడు కాదు. బీజేపే అంగీకరించినా అంగీకరించక పోయినా, కాషాయ పార్టీకి ఎప్పుడు ఎక్కడ ఎలా జ్ఞానోదయం అయిందో, ఏమో గానీ, అది కుడా ‘జాతీయ రాజకీయ స్రవంతి’ లో కలిసిపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా నలుగురిలో నారాయణ గుంపులో గోవింద తరహాలో, ఫక్తు రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోంది. 

ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉంట ఉండవచ్చును కానీ, బీజేపీలో మోడీ, షాలే కాదు, పార్టీ సామాన్య కార్యకర్తకు కూడా ఎలాంటి అనుమనాలు లేదు. బీజేపీ సామాన్య కార్యకర్త కోరుకునే దివ్యభవ్య రామమందిరం నిర్మాణం జరుగుతోంది, ఆర్టికల్ 370 రద్దయింది, రేపోమాపో ఉమ్మడి పౌర స్మ్రుతి చట్టంమవుతుంది. అన్నిటినీ మించి హిందూ ఓటు బ్యాంక్ పటిష్టమవుతోంది. సో... బీజీపీ కొత్త ఆలోచనలతో, కొత్త పంధాలో పోతోంది. ఇందులో రహస్యం ఏమీ లేదు. 

ఇప్పుడు నడుస్తున్న చరిత్రనే తీసుకుంటే, మహా రాష్ట్రలో సంకీర్ణ సర్కార్’ను కూల్చివేసేందుకు తెరవెనక నుంచి కమల దళం సాగిస్తున్న రాజకీయం ఒక ఉదహరణ అయితే, రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాలకు చెక్ పెట్టిన తీరు, మరో నిదర్శనం. రాష్ట్రపతి  అభ్యర్ధి ఎంపికకు సంబందించి ఉత్తర భారతం, దక్షిణ భారతం, సంప్రదాయ విలువలను పాటించడం, పాటించక పోవడం అనే విషయాలను పక్కన పెట్టి చూస్తే, ఎన్డీఎ అభ్యర్ధిగా జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం, బీజేపీ విరచిన ఆధునిక రాజకీయ విజ్ఞత (?)కు నిదర్శనం , అంటున్నారు. ఓ ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష అనుకూల మీడియా నైతిక విలువల గురించి చర్చిస్తుంటే, బీజేపీ, తన పని తాను చేసుకు పోయింది. అందుకే బెజేపీ అభ్యర్ధి ఎంపిక విపక్షాల ఐక్యత చిత్త చేసే ఎత్తుగడగానే చూడవలసి ఉంటుందని, పరిశీలకులు అంటున్నారు. 

అందుకే, ఎప్పుడైతే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నాయకురాలు, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్మును బీజేపీ ఖరారు చేసిందో, అదే క్షణం నుంచి ప్రతిపక్ష పార్టీలలో ఆందోళన మొదలైంది. ముందు నుంచే ఎన్డీఎ అభ్యర్ధి గెలుపు ఖరారై పోయిన నేపధ్యంలో, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్ధి ఎంపిక విషయంలోనే మలలగుల్లాలు పడ్డాయి, చివరకు ఏదో విధంగా మాజీ బీజీపే నాయకుదు యశ్వంత్ సిన్హా పోటీకి నిలిపినా, బీజేపీ ద్రౌపదిని ముర్మును తెరపైకి తేవడంతో తమ ప్రజాప్రతినిధుల్లో చీలిక వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్, తృణమూల్ సహా  ఆన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. 

ముర్ము అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే ఒరిస్సా ముఖ్యమంత్రి,  బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ బేషరతు మద్దతు ప్రకటించారు. ఆదివాసీ పార్టీ, యూపీఏ భాగస్వామి జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) సైతం మూర్ముకు అనివార్యంగానే అయినా మద్దతు తెలిపింది. ద్రౌపదిలాగే ఆ పార్టీ అధినేత, సీఎం హేమంత్‌ సోరెన్‌ సంతాలీ గిరిజన తెగకు చెందినవారు. పైగా ఆమె ఆరేళ్లకుపైగా జార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేశారు. జేఎంఎం ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ ఎస్టీలే. పార్టీ ఆమెకు మద్దతివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందుతుందన్నది హేమంత్‌ భయం.

అందుకే, లెక్కలు చూస్కుని జేఎంఎం ముర్మూకు మద్దతి తెలిపింది. అలాగే త్వరలో ఎన్నికలు జరిగే, ఛత్తీ్‌సగఢ్‌ జనాభాలో 30మంది ఎస్టీలే.ఉన్నారు. ఈ నేపధ్యంలో  తమ పార్టీకి  చెందిన ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపదికి ఓటేస్తారని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆందోళనగా ఉంది. మధ్యప్రదేశ్‌లోనూ గిరిజనులు 21శాతం వరకు ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌.. ద్రౌపదికి మద్దతివ్వకపోతే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గిరిజన బెల్టులో ఆధిక్యం సాధిస్తుందని ఆందోళన చెందుతోంది. రాజస్థాన్‌లోనూ 13.5శాతం  మంది గిరిజనులు ఉన్నారు.

ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ గిరిజన జనాభా 14 శాతం ఉన్నారు. ఈ అన్ని రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో, గిరిజన ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలకు విరుద్దంగా గిరిజన మహిళా ముర్మూకు ఓటు వేయడమే కాకుండా, బహిరంగంగ మద్దతు ప్రకటించడం కూడా అనివార్యం అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తమ్మీద ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దరిదాపుగా రాజకీయ పార్టీలన్నీ గిరిజనులపై దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

అందుకే ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా మీడియా బీజేపీకి తమలోలేని సుగుణాలు ఉన్నాయని, అదొక విభిన్న పార్టీ అనే భ్రమల్లోంచి బయటపడాలని, పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల అనుకూల మీడియా, పాత బీజేపే నైతిక ప్రమాణాల  ఆధారంగా, ఇప్పటి పరిణామాలను విశ్లేషించడం వలన  ఎకడమిక్’గా ఓకే కానీ, రాజకీయంగా మాత్రం కంఠశోష తప్ప. ప్రయోజనం ఉండదని అంటున్నారు.  ఇలా ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష అనుకూల మీడియా బీజీపే ఎప్పుడో వదిలేసిన పాత విలువల గురించి  చర్చలు సాగిస్తుంటే, కొత్త బీజేపీ తన దారిన తాను ప్రతిపక్షాలను బుల్డొజ్ చేసుకుంటూ పోతోందని పరిశీలకు భావిస్తున్నారు. అందుకే ఇకనైనా, ప్రతిపక్ష పార్టీలు, ప్రతిక్ష అనుకూల మీడియా  బీజేపీ, ఓ విభిన్న పార్టీ’ బీజేపీ, (పార్టీ విత్ ఎ డిఫరెన్స్,)అనే భ్రమలను తొలిగించుకోవడం మంచిదని అంటున్నారు.