అమీ కోర్టుని న‌మ్మించిందంతే.. మార‌లేదు!

తాగుబోతులంతా జీవితంలో వారి విల‌న్ల‌ను తిట్టుకుంటూ అరుస్తూ గోల చేయ‌డం గ‌మ‌నిస్తుంటాం. కొంద‌రు ఇంట్లో గోల చేస్తారు. చాలామంది ఇంటి బ‌య‌ట‌, రోడ్డు మీద గోల చేస్తూ అంద‌రినీ ఇబ్బందిపెడుతుంటారు. లివ‌ర్‌పూల్‌లో అమీ నెవాల్ అనే 30 ఏళ్ల మ‌హిళ తాగి నానా గొడ‌వా చేస్తోంద‌ని జైల్లో పెట్టారు. ఇది జ‌రిగి మూడు నెల‌ల‌యింది. ఆమెను సెఫ్టాన్ మెజిస్ట్రీట్ కోర్టుల‌కి తీసు కువ‌చ్చారు. ఆమె ఎంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు న‌టించింది. ఏకంగా కోర్టుహాల్లో ఏడ్చేసి న‌న్ను క్ష‌మించండి. ఇక నుంచి ఒక్క చుక్క కూడా తాగ‌ను, అస‌లు తాగేవారిని కూడా తంతాను. ఎక్క‌డికి వెళ్లినా అంద‌రితో బాగా న‌డ‌చుకుంటాను అంటూ ప్రాధేయ ప‌డింది. అంతే ఆమె క‌న్నీళ్ల‌కు జ‌డ్జిగారు క‌రిగిపోయి క్ష‌మించి వదిలేశారు.

ఆ ఆనందం త‌ట్టుకోలేక కోర్టు హాల్లోనే గ‌ట్టిగా అరుస్తూ చిన్న‌పిల్ల‌లా గోల చేసింది. ఆమె నిజంగానే చాలా మారిపోతుంది, ఆమె కోర్టుకు మాట ఇచ్చింద‌నే అనుకుంది కోర్టు. లాయ‌ర్లు ఎంతో సంతోషించారు. ఆమె త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకుని మంచి మ‌హిళ అనిపించుకుంటుంద‌ని. కానీ వారి ఆశ‌లు కొద్ది క్ష‌ణాలే బ‌తికాయి. త‌ర్వాత అమీ మామూలే!
అక్క‌డి నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చిన అమీ వెంట‌నే త‌న స్నేహితుల ద‌గ్గ‌రికి వెళ్లి కూటుగా మ‌ళ్లీ తాగింది. అక్క‌డా న‌వ్వుకుంది గ‌ట్టిగా. తాను కోర్టును ఏడిపించి న‌మ్మించాన‌ని! కానీ ఓ కుర్రాడు ఆ సీన్‌ని మొబైల్‌లో ఫైన్ పిక్చ‌ర్ అంటూ ఫోటో తీశాడు.

నిజానికి అంత‌కుముందు కూడా ఇలాంటి కేసులోనే జైలుకి వెళ్లింది. అక్క‌డ వున్న‌న్ని రోజులూ పోలీసుల్ని బాగా తిట్టేది. నీ త‌ల ప‌గ‌ల‌గొడ‌తా, గాడిదా న‌న్ను అరెస్టు చేయ‌డ‌మేమిట్రా దొంగ‌ల్ని ప‌ట్టుకోవ‌డం రాని వెధ‌వ‌ల్లారా! అని త‌ర‌చూ నోటికి వ‌చ్చిన‌ట్టు క‌నిపించిన పోలీసుల్ని అంద‌రినీ తిట్టేది. ఆమె చాలా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని రిహ‌బిలిటేష‌న్ సెంట‌ర్‌కీ పంపించారు.  కానీ ఆమె పోలీసుల ముందు మ‌హాన‌టిలా న‌టించి అంద‌ర్నీ బోర్లాప‌డేసింది. ఆమె మాత్రం బీరు బాటిల్ చేత్తో ప‌ట్టుకుని గ‌ట్టిగా న‌వ్వు కుంది. 

ప్ర‌స్తుతం ఆమెను విడిచిపెట్టిన కోర్టు నిజానికి ఆమెను మ‌ళ్లీ పాత అల‌వాట్ల‌తో జీవితంలో పాడ‌యిపోకుండా నిబద్ధ‌త‌తో జీవించేలా ఆమెపై గ‌ట్టి నిఘా పెట్ట‌వ‌ల‌సింది అని కొంద‌రు లాయ‌ర్లు, సామాజిక కార్య‌క‌ర్త‌ల మాట‌!