త్వరలో బ్యాంకుల సంస్కరణలకు మోడీ ప్రభుత్వం సిద్దం

 

దేశంలో అన్ని బ్యాంకులను కామన్ గా పట్టిపీడిస్తున్న సమస్య రుణాల ఎగవేత కారణంగా పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులు. చట్టపరంగా ఉన్న కొన్ని అవరోధాలు, అనేక ఇతర కారణాల వలన అన్ని బ్యాంకులలో ఈ నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోవడంతో బ్యాంకుల ఉనికికే ప్రశ్నార్ధకంగా మార్చుతున్నాయి. ఇది కొత్తగా ఏర్పడిన సమస్య కాదు. అనేక దశాబ్దాలుగా అన్ని బ్యాంకులను పట్టి పీడిస్తున్న సమస్య. కానీ ఇంతవరకు పాలించిన యూపీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు దానికి తాత్కాలిక నివారణోపాయాలతో కాలక్షేపం చేసిందే తప్ప దీనికి శాశ్విత పరిష్కారం చూపలేదు. కానీ మోడీ ప్రభుత్వం దీనికి శాశ్విత పరిష్కారం కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు ఆర్హిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. 

 

ఈరోజు ఇండియన్ బ్యాంక్ యొక్క 109వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ బ్యాంక్ యొక్క 109వ శాఖను ఆర్ధికమంత్రి అర్జున్ జైట్లీ డిల్లీలో ఈరోజు ప్రారంభించారు. దానితో బాటే ఆ బ్యాంక్ కొత్తగా ప్రవేశపెట్టిన “బంచ్ నోట్ యాక్సప్టర్స్” (నోట్ల కట్టలను యదాతధంగా పరిశీలించి స్వీకరించే) యంత్రాన్ని కూడా ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బ్యాంకులలో నిరర్ధక ఆస్తులు చాలా ఆందోళనకరమయిన స్థాయికి పేరుకుపోతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణాలు రుణాలు ఇచ్చేటప్పుడు విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయడం, రుణాల మంజూరు, వసూలులో తీవ్ర అశ్రద్ద, అలసత్వం చూపడం, కొన్ని వ్యవస్థలలో ఎదురవుతున్న ఆర్ధిక సవాళ్లు వంటి అనేక కారణాల చేత ఈ నిరర్ధక ఆస్తులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వం చేప్పట్టిన దిద్దుబాటు చర్యల కారణంగా గత డిశంబర్ నాటికి 5.63 శాతం ఉన్న ఈ నిరర్ధక ఆస్తులు మొన్న మార్చి ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 5.20 శాతానికి దిగివచ్చాయి. ప్రభుత్వం చేపడుతున్న కటిన చర్యల వలన మున్ముందు ఇది ఇంకా దిగివస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలను," అని అన్నారు.

 

"మేము ప్రవేశపెట్టబోయే కొన్ని కొత్త విధానాలు ఈ నిరర్ధక ఆస్తులను వదిలించుకోవడానికి, మళ్ళీ కొత్తగా పోగుపడకుండా ఉండటానికి బ్యాంకులకు చాలా సహాయపడతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. అప్పుడు బ్యాంకులే ఈ సవాలును సులువుగా ఎదుర్కొనే శక్తిసామర్ధ్యాలను సమకూర్చుకోగలవు. రానున్న నాలుగేళ్ళలో జాతీయ బ్యాంకులన్నిటికీ కేంద్రప్రభుత్వం భారీగా మూలధనం సమకూర్చేందుకు  ప్రణాళికలు సిద్దం చేసుకొంటోంది. ఆ నిధులు కూడా వచ్చి జేరితే జాతీయ బ్యాంకులన్నీ ఆర్ధికంగా మరింత శక్తివంతం అవడమే కాకుండా ఈ రుణాలు, నిరర్ధక ఆస్తుల సమస్యలను ధీటుగా ఎదుర్కోగలవని చెప్పగలను,” అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu