మిథున్ రెడ్డి జైలు ఎపిసోడ్.. కోర్కెల చిట్టా వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
posted on Jul 22, 2025 12:49PM
ఒక టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి భోజనం, మంచం, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు, రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్స్. ఇదీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలిక నిందితుడు మిథున్ రెడ్డి జైల్లో కావాలని అడిగిన సౌకర్యాలు.
ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు ఆయన కోరినవన్నిటికీ సమకూర్చమని జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. జులాయి అనే సినిమాలో సినిమాలో బ్రహ్మాంనందం అడిగినట్టు.. నోట్ బుక్స్ పెన్స్ కూడా అడగటం చూస్తుంటే... ఇప్పటి వరకూ వేసిన లిక్కర్ లెక్కలు చాలవనా.. కొత్తగా జైల్లో కూడా లెక్కలు వేయాలా? అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక రాజకీయ ప్రముఖుడు జైలుకెళ్లాడని తెలిసిన వెంటనే ఇలాంటి వార్తలు తరచూ వస్తుంటాయ్. బేసిగ్గా రాజకీయ రిమాండ్ ఖైదీల విషయంలో అధికారులు కూడా ఏమంత కటవుగా ఉండరు. వారికి తోచినంతలో వారు వీరికి మర్యాదలందిస్తూనే ఉంటారు.