సింగపూర్ పర్యటనలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు : లోకేశ్
posted on Jul 31, 2025 7:14PM

సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన విజయవంతమైందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఎన్నడు లేని విధంగా 2 వేలమంది తెలుగువారితో సమావేశమయ్యారు. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి తెలిపారు. తాము ఎంవోయూలు చేయట్లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని జూమ్‌కాల్ ద్వారా ఆర్సెల్లార్ మిత్తల్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, డేటా సెంటర్‌లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడించారు.
2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను వైసీపీ అధినేత జగన్ నాశనం చేశారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ కోరింది. ఆ దేశ ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా గత ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసింది. పారదర్శకతలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్ర వేశారు. అమర్‌రాజా, లులు సహా పలు కంపెనీలను జగన్ తరిమేశారు. కానీ, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, ఏపీకి చంద్రబాబు ఉన్నారు.
ఐటీ పటంలో విశాఖను పెట్టాలని నిర్ణయించుకున్నాం. హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు.. టీసీఎస్‌కు ఇచ్చాందేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99పైసలకే భూమి కేటాయించాం. దీనిపై వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు. తక్కువ ధరకు భూముల్ని మేం హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు.. టీసీఎస్‌కు ఇచ్చాం. ఉద్యోగాలు వస్తాయని రూ.99పైసలకే భూములు ఇస్తున్నాం. అందులో తప్పేంటి? జగన్ తెచ్చిన పెట్టుబడులకంటే మా ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ లోకేశ్ తెలిపారు
మధ్యం కుంభకోణ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక లిక్కర్ కంపెనీ రూ.400 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసిందని చెప్పారు. బంగారంతో లిక్కర్ తయారు చేయలేరు కదా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్లింది? అని నారా లోకేష్ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కంపెనీకి ఆదాన్ సంస్థ నుంచి డబ్బులొచ్చాయని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా.. దమ్ముంటే కాదని ఈ వ్యాఖ్యలను ఖండించాలంటూ ఆయనకు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు