కాళేశ్వరంపై నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్

 

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల ఆరోపణలపై  పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికను షీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. బీఆర్‌కే భవన్‌కు వెళ్లి.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతిపై 15 నెలల పాటు విచారణ జరిపారు. జస్టిస్ పీసీ ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి విచారణ చేశారు. 

కమిషన్ అందించిన నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు రాహుల్ బొజ్జా. కమిషన్ తన నివేదికలో ఏం పేర్కొంది.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు.

కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులో లోపాలకు తామే కారణమని నివేదిక ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదురుకోవాలని అంశంపై డిస్కస్ చేశారు. తాజా నివేదికలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పిదాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు నేడే, రేపో బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu