వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో... లేదో : మంత్రి జూపల్లి

 

మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తాను చెప్పలేనని మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాను ప్రజలకు హామీలు ఇవ్వనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జూపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే, మంత్రి  చేసిన ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని చూడాలి మరి.

అధికార పార్టీలో మంత్రి మాటల విన్న అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మంత్రి జూపల్లి రెండు రోజులపాటు నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పర్యటించారు. నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీలో, గురువారం ఆదిలాబాద్‌ జిల్లాలోని గురుకుల పాఠశాల కళాశాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని.. ఆటలు బాగా ఆడాలని ప్రోత్సహించారు. 

శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాలోని ‘‘ఒకటే జననం.. ఒకటే మరణం.. ఒకటే గమనం.. ఒకటే గమ్యం.. గెలుపు పొందే వరకు అలుపులేదు మనకు’’ పాటను తన సెల్‌ఫోన్‌ నుంచి ప్రత్యక్షంగా మంత్రి విద్యార్ధులకు  వినిపించారు.  ఆత్మహత్య చేసుకునేకంటే.. ఎదురుతిరిగి జీవితంలో గెలవాలని ప్రేరణ నింపారు. విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu