కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా
posted on Sep 12, 2025 3:12PM

ఈనెల 15న జరగాల్సిన కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా సభ వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ తెలిపింది. సభ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో తెలియస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని హస్తం పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
సభకు హారజరయ్యే కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని పక్కగా వ్యూహ రచన చేసింది.