అరటిపండును పాలతో కలిపి తింటే ఈ నష్టాలు తప్పవట..!


అరటిపండు.. అందరికి సులువుగా దొరికే పండు. సీజన్ తో సంబంధం లేకుండా అరటిపండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. రోజుకు ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు వైద్యులు. అరటిపండ్లు చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ సులువుగా తినడానికి అనువుగా ఉంటాయి. చాలామంది అరటిపండును ఉదయాన్నే అల్పాహారంగానో లేదా ఉదయం తీసుకునే ప్రోటీన్ డ్రింక్స్ లోనూ వాడుతుంటారు. ముఖ్యంగా అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం చాలా మంది అలవాటు.  మిల్క్ షేక్ అయితే ఎడాపెడా తాగేస్తారు. అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

జీర్ణసమస్యలు..

అరటిపండును పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.  ఆయుర్వేదం ప్రకారం పాలు, అరటిపండు రెండూ బరువుగా ఉండే పదార్థాలు. రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.  ఉబ్బరం,  గ్యాస్ లేదా మలబద్దకానికి కారణం అవుతుంది.

కఫం..

అరటిపండు, పాలు రెండింటిని కలిపి తీసుకుంటే కఫం ఏర్పడుతుందట.  ఈ రెండింటి కాంబినేషన్ అంత మంచిది కాదని అంటున్నారు. కఫ శరీరం ఉన్నవారు ఈ కాంబినేషన్ ను అస్సలు ట్రై చేయకపోవడమే మంచిది.  కఫం పెరిగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.

అలెర్జీలు, సైనస్..

అరటిపండు, పాలు కాంబినేషన్ కొంతమందికి అలెర్జీలు రావడానికి కారణం అవుతుందని అంటున్నారు. శరీరంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి.  ఇది మాత్రమే కాకుండా సైనస్ రద్దీని ఈ కాంబినేషన్ పెంచుతుందట.  ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారికి ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు.

నీరసం..

పాలు, అరటిపండు రెండూ శక్తివంతమైనవే.. ఇవి రెండూ శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం భారంగా మారుతుందని, ఇది నీరసం ఫీలింగ్ పెంచుతుందని అంటున్నారు. ఒళ్లంతా భారంగా అనిపించడం వల్ల బాగా నీరసంగా అనిపిస్తుందని కొందరు అనుభవాల ద్వారా పంచుకున్నట్టు వైద్యులు పేర్కొన్నారు.

రక్తంలో చక్కెర..

అరటిపండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది.  ఇక పాలలో కూడా గ్లూకోజ్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేటికాలంలో  డయాబెటిస్ సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా.. ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండటం మంచిది.


                                 *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu