మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాడారో అంతే!

సిక్స్ ప్యాక్ బాడీ బిల్డింగ్ కోసం మీరు ఇంజక్షన్ వాడితే మీ ప్రాణాలు పోతాయి. వైద్యుల హెచ్చరిక.మీకందరాలు పెరగాలంటే రోజూ జిమ్ కు వెళ్తున్నారా కండ రాలు పెరగడానికి మీరు ఆహారం తీసుకుంటున్నారా. మీకండరాలు త్వరగా పెరగాలంటే మీరు డాక్టర్ సలహా లేకుండా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ విచ్చల విడిగా వాడారంటే మీప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు కార్దియాలజిస్ట్లులు. ఈ అంశాన్ని గురించి ఆరోగ్య రంగ నిపుణులు మాట్లాడుతూ కొన్ని మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మరాదని.వైద్యుల సలహా సూచన మేరకు వైద్యుల పర్యవేక్షణలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాడడం క్షేమదాయకమని సూచించారు. ఈ ఇంజక్షన్ వాడడం వల్ల శరీరంలో వచ్చే మార్పులలో వణుకు, గుండె దడ, కాలలు,ఎదోజరిగిందన్న ఆందోళన, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం కంటి చూపు  మందగించడం చూపు కోల్పోవడం మరణించడం దానికి కారణం గుండెపోటు గా నిపుణులు నిర్ధారించారు. జిమ్ లో ఎక్కువగా పాల్గొనేవారు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ద్వారా త్వరాగా సినిమా హీరోల్ల సిక్స్ ప్యాక్ కోసం కండరాలు పెంచి బాడీ బిల్డర్ గా తయారు కావాలని నేటి యువత చేస్తున్న ప్రయత్నం వికటిస్తోంది ఇంజక్షన్ అతిగా వాడితే మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పూనాలో ఫే డి ఏ అధికారులు నిర్వహించిన దాడిలో 246 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.ఎఫ్ డి ఏ అధికారు ఇంజక్షన్లను స్వాదీనం చేసుకోవడం ఈ సంవత్సరంలో మూడవసారని అధికారులు పేర్కొన్నారు. వారం క్రితం నుర్వహించిన దాడిలో పూనాకు చెందినా ఎఫ్ డి ఏ అధికారి కివసర్ తెలిపారు.

ఈ ఘటన ను స్వర్ణ తే క్రైమ్ విభాగం లో కేసునమోదు చేసినట్లు తెలిపారు కాగా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అసలు ధర 299 రూపాయలు కాగా 1౦౦౦ రూపాయాలు అంతకుమించి ఎక్కువ ధరకే మార్కెట్లో అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు అనుమతులు లేకుండా డాక్టర్ల సూచన ప్రిస్కేప్షణ్ లేకుండా యదేచ్చగా ఇంజక్షన్ అమ్మకాలు సాగించడాన్ని అధికారులు గుర్తించారు. స్వాదీనం చేసుకున్న మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ విలువ దాదాపు 1.7౦ లక్షలు ఉంటుందని కివాసర్ తెలిపారు. ఈ ఇంజక్షన్ ను ప్రతిరోజూ వాడితే మత్తుగా ఉంటుందని భయంకరమైన  మానసిక అశాంతి ఎదో ఆందోళన, భయం వణుకు ఒక్కోసారి మూర్చ రక్తప్రసారంలో మార్పులు హెచ్చుతగ్గులు కంటి చూపు కోల్పోవడం ఒక్కోసారి తీవ్రంగా పరిణమించి మరణానికి దారితీస్తుంది అని హెచ్చరించారు.

ఇదే అంశం పై మణిపాల్ ఆసుపత్రికి చెందిన కార్దియలజిస్ట్ డాక్టర్ అభిజిత్ జోషి మాట్లాడుతూ అత్యవసర సమయంలో అంటే ట్రోమా సర్జరీలలో గుండెను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ మందు ఇంజక్షన్ వాడతారని గుండె వేగం అతిగా కొట్టుకోవడం పల్స్ పడిపోయిన అత్యవసర విభాగంలో చేర్చాల్సి ఉంటుంది.మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఇతర రాష్ట్రాల నుండి చట్ట వ్యతిరేకంగా విక్రయిస్తున్నారని చట్ట వ్యతిరేకం గా ఇంజక్షన్లు అమ్మే వారిపై ఖటిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ డి ఏ అధికారులు హెచ్ చర్చించారు.