సురక్షితమైన,ప్రభావ వంతమైన నాణ్యమైన రక్తం అవసరం...

2౦21 గణాంకాల ప్రకారం రక్తం డిమాండ్- పంపిణీ మధ్య 1.46 --1.2 5 యూనిట్ల వ్యత్యాసం ఉంది. మనదేశం లో రక్త దానం చేసే అర్హత ఉన్న కుటుంబాలు దాదాపు 5౦౦ మిలియన్లకు పైగానే రక్తదాతలు ఉన్నట్లు సమాచారం.రక్తదానం ఆరోగ్య సంరక్షణ లో అత్యంత కీలకం రక్తదానం కేవలం రక్త మార్పిడి చేయడం అన్ని అనారోగ్య సమస్యలకు ఒక ముందడుగుగా భావించవచ్చు.రక్తం కొన్ని సందర్భాలలో అంటే చికిత్చ కు శస్త్ర చికిత్చ కు అత్యవసరం మనకు జీవితాన్ని ఇస్తుంది.జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు,అత్యవసర సమయంలో అంటే అత్యవసర శస్త్ర చికిత్చ సమయంలో ఎదురయ్యే శవాళ్ళను అధిగమించడానికి అలాగే గర్భవతులు గా ఉన్నప్పుడు ప్రసవం సమయంలో వచ్చే వివిదరకాల సమస్యలు పిల్లలలో వచ్చే రక్త హీనత,ట్రోమా సమయంలో ముఖ్యంగా రోడ్డు ప్రమాదం లో క్యాన్సర్ సర్జరీల సమయంలో సమర్ధవంత మైన మెడికల్ మేనేజ్ మెంట్ రక్త సంబంధిత సమస్యలు సమతుల్యం లోపించినప్పుడు రోగికి రక్తం ఎక్కించడం లేదా ట్రాస్ ఫ్యుషణ్ చేయడం అత్యవసరం.2౦21 గణాంకాల ప్రకారం రక్తం డిమాండ్-పంపిణి మధ్య వ్యత్యాసం 1.46 --1.25 గా ఉంది. మనదేశం లో రక్తదానం చేయగల అర్హులైన ఆరోగ్యవంతమైన వ్యక్తులు 5౦౦ మిలియన్లకు పైగానే ఉన్నారు.

రక్తం సురక్షితం...

మన దేశం లో దురదృష్ట వశాత్తు చాలామంది ప్రజలకు రక్త మార్పిడి సమయానికి జరగడం లేదు. అదీ సురక్షితమైన సరైన స్క్రీనింగ్ చేసిన రక్తం లభించక పోవడం వల్ల చాలామంది మరణించిన దాఖలాలు ఉన్నాయనేది వాస్తవం. అదీకాక రక్త మార్పిడి తరువాత ఇన్ఫెక్షన్లు వస్తూ ఉండడం తో సురక్షిత మైన రక్తం కదా అన్నానుమనాలు వస్తున్నాయి.ముఖ్యంగా తలసీమియా రోగులకు ఎక్కువసార్లు రక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడు రక్తం బ్లడ్ బ్యాక్ లో అందక రక్త దాతలు దొరకక అటు తల్లి తండ్రులు ఇటు తలసీమియా వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడడం మనం చూసాము ఈ విషయం లో తలసేమియా సంస్థ అవగాహన సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది రోగులను ఆదుకునే ప్రయత్నంచేస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్త దాతలు అందరూ స్క్రీనింగ్ చేయాలని హెచ్ ఐ వి, హెపటైటిస్ బి, హేపటైటిస్ సి, సిప్లిస్, ఇన్ఫెక్షన్లు ఉన్నవారి రక్తం వినియోగిస్తే కొన్నిరాకల సమస్యలు తప్పవని  స్క్రీనింగ్ లో ఇన్ఫెక్షన్ లేని దాతల రక్తం మాత్రమే వినియోగించడం  దానికే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నిరకాలుగా సురక్షితం అనిపెర్కొన్నారు.భారత్ లో సేరాలజికల్ స్క్రీనింగ్ తప్పనిసరి అని అందులో హెపటైటిస్ బి, వైరస్ హెచ్ బివి,హెపటైటిస్ సి, వైరస్ హెచ్ సి వి ,హెచ్ ఐ వి,కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్లు కొంతకాలమే ఉంటాయి.స్క్రీనింగ్ లో కొన్నికొన్ని సార్లు నెగెటివ్ రావచ్చు. కొత్త కొత్త వేరియంట్లు పెరగవచ్చు.ఎవరైతే వ్యక్తి రక్తం తీసుకుంటారో టి టి ఐ ఎస్ పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అత్యవసరంగా ప్రమాణాలకు అనుగుణంగా స్క్రీనింగ్ చేయడం అవసరం .

బ్లడ్ స్క్రీనింగ్ తప్పనిసరి ...

ఏ షియన్ అసోసిఎషన్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యుషణ్ మెడిసిన్ ప్రతిఒక్కరు దాతలు న్యుక్లిక్ ఆసిడ్ టెస్టింగ్ ను ఆయా బ్లడ్ బ్యాకులలో తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల ప్రతివ్యక్తిలో దేశంలోని 9౦,౦౦౦ కొత్త ఇన్ఫెక్షన్లు నివారించవచ్చు.న్యూ క్లిక్ ఆసిడ్ ఏమ్ప్లిఫికేషణ్ టెస్ట్ రక్తం సురక్షితం గా ఉండేందుకు దోహదం చేస్తుంది.ఉన్నత ప్రమాణాలు సాధించినట్లు అవుతుంది. దీనివల్ల గణనీయంగా హెపటైటిస్ బి,సి హెచ్ ఐ వి ,న్యూక్లియర్ ఆసిడ్సాంకేతికత తో వైరస్ ను గుర్తించవచ్చు.రక్తమార్పిడిలో వచ్చే ప్రమాదాన్ని గుర్తించవచ్చు.న్యుక్లిక్ ఆసిడ్ టెస్ట్ ను కేవలం భారత  దేశంలో మాత్రమే అనుమతించింది.చాలా అత్యంత ప్రభావ వంతమైన సరైన సమయంలో పి సి అర సాంకేతికతను వ్యక్తి గత దాతలు చేసుకోవచ్చు.

ముందుకు ఎలావేళ్ళాలి....

సురక్షితమైన ప్రభావ వంతమైన నాణ్యమైన రక్తం ఉత్పత్తులతోపాటు సమర్ధవంతమైన సమన్వయం రక్త నిధి బ్యాకులు నిర్వాహకులు హక్కుదారులు ఆరోగ్య సౌకర్యాలు కల్పించేందుకు ఉత్తమ సాంకేతికత పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా దాయాజ్ఞాస్టిక్ రంగం,లో ప్రమాణాలు పాటించడం ద్వారా మాత్రమే సురశితమైన రక్తం అందించగలం.