కథ నచ్చలేదా? అసలు పూరీయే నచ్చలేదా?

 

అసలు చిరంజీవికి కథ నచ్చలేదా? లేక పూరీ నచ్చలేదా? అనే టాక్ నడుస్తోంది. రాంగోపాలవర్మ శిష్యుడైన పూరీ జగన్నాథ్ మెంటాలిటీ కూడా దాదాపు వర్మలాగే దూకుడుగా ఉంటుందని... అదే అతనికి మైనస్సైందని అంటున్నారు, మెగాస్టార్ 150వ సినిమాకి పూరీనే డైరెక్టర్ అని అనౌన్స్ చేశాక... ఆ ప్రాజెక్టులను ఎంతో బాధ్యతతో తలకెత్తుకోవాల్సిన పూరీ... తన అనవసర చేష్టలతో ఓవర్ కాన్ఫిడెన్ష్ తో చేతులారా అవకాశాన్ని పోగొట్టుకున్నాడని చెబుతున్నారు, అదే సమయంలో సైడైపోయాడనుకున్న వీవీ వినాయక్ తన చేతలతో ఎంతో తెలివిగా వ్యవహరించి చిరంజీవి ప్రెస్టీజియస్ వెంచర్ ను సొంతం చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు

అయితే పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ ల్లో ఎవరు బెస్ట్ అంటే ఎవరి ఫార్మాట్ లో వాళ్లు కింగ్ లని చెప్పాలి, తమ టాలెంట్ తో  ఇద్దరూ టాలీవుడ్ లో అద్భుతాలు సష్టించినవాళ్లే, సూపర్ హిట్లు ఇచ్చినవాళ్లే... అయితే పూరీ సినిమాల్లోని హీరో మన చుట్టూ ఉండే కుర్రోడిలాగే కనిపిస్తూ డ్యాషింగ్ అండ్ డైనమిక్ గా ఉంటాడు, డైలాగ్ లు కూడా స్ట్రైట్ గా పంచింగ్ గా ఉంటాయ్, అయితే హీరోయిజం రోమాలు నిక్కబొడుచుకునేలా చేయదు, పైగా పోకిరి తర్వాత పూరీకి సరైన హిట్టే లేదు, అప్పుడెప్పుడో మహేష్ బాబు బిజినెస్ మెన్, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ టెంపర్... ఫర్వాలేదనిపించినా మంచి హిట్టు మాత్రం దక్కలేదు, ఇవన్నీ కాదని హీరోయిన్లతో ఎఫైర్స్, ఘాటు విషయాల్లో ఎప్పుడూ మునిగితేలుతూ ఉంటాడనే టాక్ ఉంది. ఇవే చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దూరమయ్యేలా చేశాయంటున్నారు.

ఇక వీవీ వినాయక్ విషయానికొస్తే... అతని సినిమాల్లోని హీరోయిజం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది, తన తొలి సినిమా ‘ఆది‘ నుంచీ అది కనిపిస్తుంది, పైగా అభిమానుల ఇష్టానికి అనుగుణంగా హీరోలను ప్రజెంట్ చేయగల సత్తా ఉన్నోడని పేరుంది, అందుకే చాలామంది సినీ ప్రముఖులు... తమ వారసులను ఇంట్రడ్యూస్ చేయడానికి వినాయక్ నే ఎంచుకుంటున్నారు, నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుడును హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి వినాయక్ ను ఎంచుకుని కొడుక్కి టాలీవుడ్ లో బలమైన పునాది వేయగా, ఇప్పుడు అక్కినేని కుటుంబం నుంచి అత్యంత ప్రెస్టేజియస్ గా లాంఛ్ అవుతున్న నాగార్జున తనయుడు అఖిల్ సినిమాను కూడా వినాయకే డైరెక్ట్ చేశాడు, అఖిల్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి వినాయకే సరైన వాడని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకున్నాడు నాగార్జున, అయితే పూరీ ఆ తరహా నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాడని, అందుకే దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత హీరోగా రీలాంఛ్ కాబోతున్న చిరంజీవి కూడా వినాయక్ నే ఎంచుకున్నాడని అంటున్నారు.

పైగా వినాయక్... వివాదాల జోలికి పోకుండా మితంగా ఉంటాడనే పేరుంది, ఏం చేసినా కూల్ గా ఎవరినీ నొప్పించకుండా తన పని తాను చేసుకుపోతాడనే గుడ్ టాక్ ఉంది, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే అమితమైన గౌరవం ఉంది, అదే చిరంజీవి ప్రెస్టేజియస్ ఫిల్మ్ దక్కేలా చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu