వినాయక్ లో ఉన్నదేంటి? పూరీలో లేనిదేంటి?
posted on Oct 8, 2015 5:30PM

మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ... పీఆర్పీ ఫెయిల్యూర్... కాంగ్రెస్ లో విలీనం... కేంద్ర మంత్రి పదవి... ఈ ఆరేడేళ్లలో చిరు పొలిటికల్ లైఫ్ ముగిసిపోయింది, ఏదో పేరుకి కాంగ్రెస్ నాయకుడని అనిపించుకుంటున్నా ఆ దరిదాపులకే వెళ్లడం లేదు, మొన్నామధ్య రాహుల్ టూర్లో మెరుపులా కనిపించినా ఆ తర్వాత అటువైపు చూడటమే మానేశారు. ఇప్పుడు ఆయన దృష్టంతా 150వ సినిమాపైనే ఉంది. అయితే ఆ సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరు? పూరీ జగన్నాథా? వీవీ వినాయకా?
చిరంజీవికి నటన కొత్త కాదు, రికార్డులు అంతేకంటే కొత్తకాదు, కానీ ఎందుకింత కసరత్తు, డైరెక్టర్ ను ఎంచుకోవడంలో ఎందుకీ డైలమా, అసలు చిరుని దర్శకులు మెప్పించలేకపోతున్నారా? లేక మెగాస్టారే గందరగోళంలో ఉన్నారా? దర్శకులు మంచి కథలుచెబుతున్నా ఆయన సరిగా జడ్జ్ చేయలేకపోతున్నారా? అసలు ఆయన ఎలాంటి కథ కావాలని కోరుకుంటున్నారు? మన డైరెక్టర్లు ఎక్కడ విఫలమవుతున్నారు?
చిరంజీవి 150వ సినిమా చేయనున్నట్లు న్యూస్ వచ్చినప్పుడు దాన్ని వీవీ వినాయక్కే డైరెక్ట్ చేస్తాడంటూ వార్తలొచ్చాయి, దానికి అనుగుణంగా వీవీ చేసిన కామెంట్లు కూడా నిజమేనేమో అనిపించాయి, కాలం గిర్రున తిరిగింది... సడన్ గా పూరీ జగన్నాథ్ పేరు తెరమీదకొచ్చింది, రైటర్ మచ్చరవి రాసిన కథను పూరీ వినిపించగా చిరంజీవికి ఫస్ట్ హాఫ్ తెగ నచ్చేసింది, దాంతో మెగాస్టార్ 150వ సినిమా డైరెక్టర్ పూరీయేనంటూ మెగా కాంపౌండ్ డిక్లేర్ చేసేసింది, రామ్ చరణ్ అయితే ఏకంగా ట్విటర్లో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు, అయితే ఇంతలో మరో ట్విస్ట్, పూరీ చెప్పిన సెకండ్ హాఫ్ నచ్చలేదంటూ సైడ్ ట్రాక్ చేసి, మళ్లీ వీవీ వినాయక్ ను తెరపైకి తెచ్చింది మెగా కాంపౌండ్
అయితే పూరీని తప్పించడానికి కారణం కథ నచ్చక కాదని, ఇంకేదో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.... (సెకండ్ పార్ట్ కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి)
(కథ నచ్చలేదా? అసలు పూరీయే నచ్చలేదా? మెగా నిర్ణయం వెనుక మెయిన్ రీజన్ ఇదేనా?)