లొంగిపోయిన మనోరమాదేవి.. నితీశ్ ఆగ్రహమే కారణమా..!

 

గయ కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ యువకుడిని కాల్చివేసిన ఘటనలో ఎమ్మెల్సీ మనోరమాదేవి కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈరోజు ఆమె కోర్టులో లొంగిపోయింది. దీనిపై విచారించిన కోర్టు ఆమెకు 14రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఆమె లొంగిపోవడానికి కారణం నితిశ్ కుమారే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే.. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనను.. మీ పార్టీ వారే క్రిమినల్ కేసుల్లో ఎందుకు ఎక్కువగా ఇరుక్కుంటున్నారన్న ప్రశ్న వేయగా ఆయన దానికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆమె గత మూడు రోజులుగా ఆజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో ఇదే ప్రశ్నను నితీశ్ ను అడుగగా.. దానికి కూడా ఆయన ఘాటుగానే సమాధానం చెప్పారు. ఆమె అజ్ఞాతంలో ఉంటే దానికి కారణం నేనా.. నేను ఆమెను దాచానా.. లేక ఎవరైనా దాచారనా మీ ఉద్దేశం.. అంటూ మండిపడ్డారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ తరువాత గంటలోనే మనోరమాదేవి పోలీసుల ముందు లొంగిపోయింది.

 

కాగా తన కారును ఓవర్ టేక్ చేశాడని చెప్పి మనోరమా దేవి కొడుకు రాఖీ యాదవ్ ఓ విద్యార్ధిని తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాను కూడా పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu