ఢిల్లీకి పయనమైన చంద్రబాబు.. 12 గంటలకు మోడీతో సమావేశం

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పయనమయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించేందుకుగాను ఆయన పెద్ద చిట్టానే తయరు చేసుకొని వెళ్లినట్టు తెలుస్తోంది. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన చంద్రబాబు హస్తినలో ల్యాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న ఆయన అక్కడ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు పార్టీ ఎంపీలతో సమావేశమై.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu