మహా టీవీ ఆఫీస్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
posted on Jun 28, 2025 3:19PM

మహా టీవీ ఆఫీస్‌పై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లు, స్టూడియోను ధ్వంసం చేశారు.
కార్యకర్తలు ఆఫీసులోకి ప్రవేశించి నిరసన తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకున్నారు. మీడియా స్వేచ్చపై దాడిని ఖండిస్తున్నట్లు మహా టీవీ వంశీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని తెలిపారు. కానీ స్టూడియో పై దాడి, కెమెరాలను ధ్వంసం చేయడం పద్ధతి కాదని ఆయన తెలిపారు.