మాజీ సీఎం కుమారుడు అరెస్ట్

 

చత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సీనియర్ నేత భూపేశ్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ సంబంధించి మనీ లాండరింగ్  కేసులో ఇవాళ తండ్రీకొడుకులిద్దరికీ చెందిన ఆస్తులపై భారీ బందోబస్తు నడుమ అధికారులు సోదాలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్ స్కామ్‌లో రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. లిక్క‌ర్ స్కామ్‌లో త‌మ‌కు కొత్త ఆధారాలు దొరికినట్లు ఈడీ చెబుతోంది. 

అసెంబ్లీ స‌మావేశాల‌కు చివ‌రి రోజు కావ‌డంతో రాజ‌కీయ క‌క్ష‌తో ఈడీ సోదాలు చేప‌డుతున్నార‌ని మాజీ సీఎం భూపేశ్ భ‌గేల్ ఆరోపించారు.మార్చి 10వ తేదీన కూడా చైత‌న్య భ‌గ‌ల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. కాగా.. బర్త్‌డే రోజు నాడే చైతన్యను ఈడీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం. దీనిపై ఆయన తండ్రి భూపేశ్‌ స్పందించారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు నేడు చివరి రోజు. అదానీ సంస్థ కోసం చెట్లు కూలుస్తున్న అంశాన్ని మేం లేవనెత్తాం. వెంటనే మా ఇంటికి ఈడీని పంపించారు. నా కుమారుడి పుట్టిన రోజున మంచి బహుమతి ఇచ్చారు’’ అని మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.