రేవంత్ రెడ్డి వల్లే టీడీపీ సర్వనాశనం..


టీడీపీ నుండి కూకట్ పల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. ఆతరువాత టీఆర్ఎస్లో చేరిన మ్మెల్యే మాధవరం కృష్ణారావు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కారణంగానే తెలంగాణలో టీడీపీ సర్వనాశనమైందని.. తన స్వార్థ రాజకీయాలకోసమే ప్రజలను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని.. రేవంత్ రెడ్డికి ప్రత్యేక భద్రత ఏమీ అవసరం లేదన్న మాధవరం... ప్రజలను రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. మరి మాధవరం మాటలకు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu