ర‌ఘురామ ఫిర్యాదుపై స్పీక‌ర్ యాక్ష‌న్‌.. రంగంలోకి కేంద్ర హోంశాఖ‌.. జ‌గ‌న్‌రెడ్డీ గెట్ రెడీ!

పావులు క‌దులుతున్నాయ్‌.. పాపం పండుతోంది.. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయ్‌.. త‌న‌ను క‌స్ట‌డీలో తీవ్రంగా కొట్టారంటూ ఎంపీ ర‌ఘురామ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై యాక్ష‌న్ మొద‌లైపోయింది. బంతి కేంద్ర హోంశాఖ ముందుకు వ‌చ్చింది. ఇక‌, ఏపీ స‌ర్కారుకు ముందుముందు క్రొక‌డైల్ ఫెస్టివ‌లే అంటున్నారు. 

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. మే 14న తనని అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత తీవ్రంగా హింసించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ జూన్ 2న‌ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌, డీజీపీ, సీఐడీ ఏడీజీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌‌పై ఎంపీ రఘురామ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. 

రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్‌కు గురి చేయడంపై ఆయన కుమారుడు భరత్‌, టీడీపీ ఎంపీలు కనమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌నాయుడు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌ కార్యాలయం.. వెంటనే సమగ్ర వివరాలు అందజేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను ఆదేశించింది. 15 రోజుల్లో సమగ్ర నివేదిక‌ను పంపాలని లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్‌ నోటీసులు పంపింది.   

ఎంపీ ర‌ఘురామ ఫిర్యాదుపై లోక్‌స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం స్పందించ‌డంతో వివాదం పార్ల‌మెంట్ సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. వెంట‌నే పూర్తి వివ‌రాలు అంద‌జేయాలంటూ కేంద్ర హోంశాఖను ఆదేశించ‌డం కీల‌క ప‌రిణామం. సీఐడీ కేసు ఏపీ స‌ర్కారు డైరెక్ష‌న్‌లోనే జ‌రుగుతోంద‌ని.. కుట్ర‌లో భాగంగానే ర‌ఘురామ‌ను టార్చ‌ర్ చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే సమ‌యంలో బెయిల్‌పై ఉన్న ర‌ఘురామ‌పై ప‌రారీలో ఉన్న‌ట్టుగా కేసులోని లూప్‌పోల్స్ వాడుకొని.. మ‌రోసారి అరెస్ట్ చేసేందుకు ఏపీ స‌ర్కారు సిద్ధ‌మ‌వుతోందనే అనుమాన‌మూ వ్య‌క్త‌మ‌వుతోంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో.. ర‌ఘురామ ఎపిసోడ్‌లో స‌మ‌గ్ర వివ‌రాలు ఇవ్వాలంటూ స్పీక‌ర్ కార్యాల‌యం కేంద్ర హోంశాఖ‌ను అదేశించ‌డం ఆస‌క్తిక‌రం. 

ఇప్పుడిక కేసుపై కేంద్ర హోంశాఖ దృష్టి పెడుతుంది. కేసులు, కుట్ర‌లు, క‌స్ట‌డీలో కొట్ట‌డాలు.. ఇలా అన్ని విష‌యాల‌పైనా వివ‌రాలు ఆరా తీస్తుంది. అప్పుడిక అవుటాఫ్ ఇంట్రెస్ట్‌ వెళ్లే ప‌రిస్థితి ఉండ‌దు. కేంద్ర హోంశాఖ‌ను ఏపీ పెద్ద‌లు ప్ర‌భావితం చేయ‌లేదు. నిజాలు నిక్క‌చ్చిగా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశ‌మూ ఉంటుంది. ఒక‌వేళ‌ క‌స్ట‌డీలో ర‌ఘురామ‌ను కొట్టార‌నే విష‌యం నిజ‌మ‌ని తేలితే.. విష‌యం పార్ల‌మెంట్ దృష్టికి వెళుతుంది. ఓ ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగం రుజువైతే.. పార్ల‌మెంట్‌లో సీఎం ప్ర‌భుత్వం దోషిగా నిల‌బ‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా, రాష్ట్రాలు, పార్టీల‌కు అతీతంగా ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఓ ఎంపీపై జ‌రిగిన దాడిని పార్ల‌మెంట్‌పైన జ‌రిగిన దాడిగానే ప‌రిగ‌ణిస్తామ‌ని ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీలు బ‌హిరంగంగానే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఈ అంశం త‌ప్ప‌క పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్తుతామ‌ని ప్ర‌క‌టించారు. ఆ భ‌యంతోనే ర‌ఘురామ‌పై వేటు వేయాలంటూ వైసీపీ లోక్‌స‌భ‌ స్పీక‌ర్‌కు మ‌రోసారి ఫిర్యాదు కూడా చేసింది.  ఏది ఏమైనా జూలైలో జ‌రిగే పార్ల‌మెంట్ సెష‌న్‌లోనే ర‌ఘురామ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆ లోగా స్పీక‌ర్ కార్యాల‌యం ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర వివ‌రాల‌ను కేంద్రం హోంశాఖ ద్వారా తెప్పించుకుంటోంది. అంటే, ర‌ఘురామ ఎపిసోడ్‌పై పార్ల‌మెంట్ సీరియ‌స్‌గా దృష్టి సారించిన‌ట్టేగా? స్పీక‌ర్ కార్యాల‌య‌మే స్పందించిందంటే మేట‌ర్ మంట పుట్టించేదేగా? అదే జ‌రిగితే.. పార్ల‌మెంట్‌లో సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ద‌బిడి దిబిడే... ర‌ఘురామతో పెట్టుకుంటే అంతే...