రెండు నెలల బాలుడి ప్రాణం తీసిన అత్త మామ.. 

మనుషులు మరి క్రూరంగా తయారు అవుతున్నారు. రకరకాల కారణాలు చెప్పుకుని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ మధ్య గొడవలు. కారణాలు ఏంటో తెలియలేదు.. ఆ గొడవలు ఎందుకు జరిగాయో తెలీదు. కసాయిగా మారుతున్నారు. ఇడ్లీ వేసినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. పెద్దల మధ్య గొడవలు పసివాడి ప్రాణం తీసింది.. ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటున్నారా.. మీరే తెలుసుకోండి.. తెలుస్తుంది. 

అది రంగారెడ్డి జిల్లా.  అబ్దుల్లాపూర్‌మెట్ మండలం. అనాజ్‌పూర్‌ గ్రామం. ఆ గ్రామానికి చెందిన రంగయ్య కుమార్తె బాలమణి రెండు నెలల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో రోజు లాగే గురువారం రాత్రి బాలుడితో పాటు కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రించారు. ఉదయం ఉదయం నిద్ర లేచి చూసే సరికి.. బాలుడు కనిపించలేదు.. ఇల్లు అంతా వెతికారు.. ఏమైపోయాడు అని కంగారు పడ్డారు. చివరికి ఆ బాలుడు ఇంటిపైన  ఉన్న నీటి ట్యాంకులో చావమై తేలాడు. 

వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తెల్లవారుజాము నుంచి బాలుడు కనిపించట్లేదని గాలించిన తల్లిదండ్రులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాజ్‌పూర్‌లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా పోలీసులుకు ఎలాంటి ఆచూకి ల‌భించలేదు. దీంతో బాలుడి ఇంటిని పోలీసులు అణువణువునా గాలించారు.  చివరకు ఇంటిపైన వెతకగా నీటి ట్యాంకులో బాలుడి మృతదేహం కనిపించింది.  బాలుడి మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మేనమామ, అత్తే హత్య చేసుంటారన్న అనుమానంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలే చిన్నారి హత్యకు కారణమని భావిస్తున్నారు. పసికందును హత్య చేసి ట్యాంకులో పడేశారని తెలిపారు. ఘటనాస్థలిని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పరిశీలించారు.  ప్రస్తుతం ఈ ఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.