అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు,   మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు యావజ్జీవ ఖైదు విధిస్తూ శనివారం  (ఆగస్టు 2) తీర్పు వెలువరించింది.  జీవిత ఖైదుతో పాటు పది లక్షల రూపాయల జరిమానా.. బాధితురాలికి 7 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు తీర్పులో పేర్కొంది.  రేవణ్ణ అరెస్టు అయిన తరువాత దాదాపు 14 నెలల పాటు కేసు దర్యాప్తు సాగింది. విచారణ ప్రారంభమైన ఎనిమిది వారాలలో తీర్పు వెలువడింది. కోర్టులో రేవణ్ణపై విచారణ శుక్రవారం (ఆగస్టు 1) ముగిసింది. శుక్రవారమే కోర్టు రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా నిర్దారించింది. రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపులు, సాక్ష్యాలు మాయం చేయడం తదితర అంశాలలో రేవణ్ణపై నేరాలు రుజువయ్యాయి.

  2024లో రేవణ్ణ హసన్పై ఆరోపణలు, ఆ ఆరోపణలకు సంబంధించి వీడియోలు వెలుగులోకి రావడంతో ఆయన జర్మనీకి పరారైపోయారు.   ఎన్నికల అనంతరమే దేశానికి తిరిగి వచ్చారు. రేవణ్ణకు మే 31న బెంగళూరు విమానాశ్రయంలో   పోలీసులు అరెస్టు చేశారు. మైసూర్ సమీపంలోని రేవణ్ణ ఫాంహౌజ్ లో వంట పని చేసే 47ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవణ్ణపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu