చిట్టచివరికి నిజం ఒప్పుకున్న డ్రాగన్..
posted on Feb 19, 2021 11:35AM
గతేడాది జూన్ లో భారత్ భిన్న సరిహద్దులో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెల్సిందే. అప్పట్లో చైనా మిలటరీ ఘాతుకానికి కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది భారత సైనికులు అమరవీరులయ్యారు. అయితే చైనా మాత్రం ఈ ఘర్షణలో తమ సైనికులు మరణించలేదని అప్పట్లో బుకాయించింది. 35 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత్ ప్రకటించింది. అయితే అప్పట్లో తమ సైనికులు ఎవరు చనిపోలేదని బీరాలు పలికిన చైనా ప్రభుత్వం...చిట్టచివరికి నిజాన్ని బయట పెట్టింది భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్‌లో జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన ఐదుగురు అధికారులు, పలువురు జవాన్లు మరణించారని మొట్ట మొదటి సారి చైనా సర్కార్ ఒప్పుకుంది. అంతేకాకుండా ఆ అధికారుల పేర్లను కూడా చైనా విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన వారికి చైనా సర్కార్ అవార్డులను ప్రకటించింది. ఈ విషయాన్ని తాజాగా చైనా మీడియానే వెల్లడించింది. మరణించిన వారిలో జిన్జియాంగ్ మిలటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్ కమాండర్ క్వి ఫాబావోతో పాటు క్విఫాబావో, చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్‌రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జువారన్‌లను చైనా ప్రభుత్వం అవార్డులతో గౌరవించింది.