సర్పంచ్ పోరులో భార్య భర్తలు? కృష్ణా జిల్లాలో ఆసక్తికర సమరం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో  చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులే పోటీ పడుతున్నారు. అన్నా  తమ్ముళ్లు , తోడికోడళ్లు, అత్తా కోడళ్లు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్లు కూడా కొన్ని పంచాయతీ హోరాహోరీగా పోరాడుతున్నారు. కృష్ణా జిల్లాలో భార్యభర్తలే పోటీ చేస్తుండటం ఆసక్తిగా మారింది.  ముదినేపల్లి మండలంలో అల్లూరు పంచాయతీ ఎన్నికలో భార్యాభర్తలు రంగంలో ఉన్నారు. స్తానిక సోమేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్ పర్సన్ రెడ్డి రాధిక, ఆమె భర్త రెడ్డి విఠల్ ఎన్నికల బరిలో ఉన్నారు. 

గ్రామంలోని శివాలయాన్ని రెడ్డి రాధిక అభివృద్ధి చేశారు. దాదాపు మూడున్నర లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఆలయంలో ఇనుప గ్రిల్స్ ను ఏర్పాటుచేయించారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో రెడ్డి రాధిక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెతోపాటు డమ్మీ అభ్యర్థిగా ఆమె భర్త రెడ్డి విఠల్ నామినేషన్ వేశారు. అయితే అనివార్య కారణాల వల్ల రెడ్డి విఠల్ తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోలేకపోయారు. దీంతో భార్యాభర్తలిద్దరూ బరిలో ఉన్నట్టయింది. భార్య రెడ్డి రాధికకు ఉంగరం గుర్తును కేటాయించగా, భర్త రెడ్డి విఠల్ కు బుట్ట గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. 

ఈ భార్యభర్తలతో పాటు అలూరు గ్రామంలో మొత్తం అయిదుగురు అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నట్టయింది. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇద్దరు భార్యాభర్తలు ఉంగరం గుర్తుకు ఓటేయమనే కోరుతున్నారు. అయితే  వారు కోరుతున్నట్టు భార్యకు మాత్రమే ఓటేస్తారో లేక పొరపాటున భర్తకు కూడా ఓటేస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu