కొడాలి నానికి బిగ్ షాక్
posted on Aug 3, 2025 12:57PM

మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. 2024లో విశాఖ త్రీ టౌన్ పోలీసులకు అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్టు U/s 353(2), 352, 351(4) సెక్షన్ల కింద సి.ఐ రమణయ్య అప్పట్లో కేసు నమోదు చేశారు.
ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.