గ్రానైట్‌ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురి మృతి

 

బాపట్ల జిల్లా బల్లికురవలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు మీద పడడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పదహారు మంది కార్మికులు క్వారీలో పని చేస్తుండగా అకస్మాత్తుగా బండరాళ్లు కిందపడ్డాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

దీంతో ఆరుగురు కార్మికులు రాళ్ల కింద పడి నలిగిపోయారని వివరించారు. చనిపోయిన వారంతా ఒడిశాకు చెందిన వారని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరపడంతోనే ఈ ప్రమాదం జరినట్లు తెలుస్తోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu