యూపీలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

 

యూపీలోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది యాత్రికులతో వెళ్లున్న బొలెరో అదనపు తప్పి కెనాలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పృథ్వినాథ్‌ ఆలయానికి భక్తులను తీసుకెళుతున్న బొలేరో వాహనం అదపుతప్పి కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదం పరాసరాయ్‌-ఆలవాల్‌ డియోర మార్గంలోని రేహారి గ్రామం సరయూ కాల్వ వంతెన వద్ద చోటు చేసుకొంది.సరయూ నది నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు వెల్లడించారు.

 ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో 15 మంది యాత్రికులు ఉన్నారు. నలుగురు వ్యక్తులను స్థానికులు కాపాడినట్లు పేర్కొన్నారు. మృతులు మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ నివాసితులు. వీరిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. బీనా (35), కాజల్ (22), మహాక్ (12), దుర్గేష్, నందిని, అంకిత్, శుభ్, సంజు వర్మ, అంజు, సౌమ్య వంటి వారు ఈ ప్రమాదంలో మరణించారు. ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఈ దుర్ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు చెప్పిన ప్రకారం, కారు డోరు తెరుచుకోక పోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. లోపల ఉన్నవారు తమ ప్రాణాల కోసం వేడుకున్నా, కారు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించే ప్రయత్నం జరిగినప్పటికీ, చాలా మందిని కాపాడలేకపోయారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటన గురించి తెలుసుకుని, మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, సరైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ దుర్ఘటన రోడ్డు భద్రతపై మరోసారి ఆలోచించేలా చేస్తోంది. భారీ వర్షాల సమయంలో రోడ్లు జారుడుగా మారడం, వాహనాల అదుపు కోల్పోవడం వంటి సమస్యలు ఇలాంటి విషాదాలకు దారితీస్తున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాలకు మాత్రమే కాక, అనేక మందికి ఒక హెచ్చరికలా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu