పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మొత్తం 23 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో  పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణలో అమెరికా జోక్యం తదితర అంశలపై కేంద్రాన్ని విపక్షాలు ప్రశ్నించనున్నాయి.'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తున్నారని, దీనిపై ప్రజల్లో అనేక ప్రశ్నలున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 200 మందికి పైగా లోక్ సభ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu