ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

 

ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి  వర్గపోరు విభేదాలు భగ్గుమన్నాయి. ఇవాళ లేక్‌వ్యూ బంజారాహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, విజాయారెడ్డి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు. అరగంట పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారంపై సభకు వచ్చిన డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసి, క్రమశిక్షణ లేని కార్యకర్తలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

కాంగ్రెస్‌, ప్రతిపక్షాల మధ్య పోటీలా కాకుండా విజయా రెడ్డి వర్సెస్‌ ఎమ్మెల్యే దానం అన్న విధంగా సీన్‌ మారింది. నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు స్పష్టంగా వెలుగుచూశాయి. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి. విజయారెడ్డికి పార్టీ ప్రత్యేక స్థానం ఇచ్చింది. ఏకంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో విజయారెడ్డిని దూరం పెడుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu