గ‌ద‌ర్ ఏక్ ఆస్కార్ క‌థ‌!

గ‌ద్ద‌ర్ కి ఆస్కార్ కీ సంబంధ‌మేంట‌న్న దానిక‌న్నా.. గ‌ద్ద‌ర్ కి సినిమాల‌కూ ఉన్న సంబంధం కూడా చాలా చాలా త‌క్కువ‌. గ‌ద్ద‌ర్ ఎప్పుడో మా భూమిలో బండెన‌క బండి క‌ట్టి అనే పాట.. అది కూడా బండి యాద‌గిరి అన్న  మ‌రో ర‌చ‌యిత  రాసిన పాట పాడారు. ఆ తరువాత రంగుల కల సినిమాలో  జమ్ జమ్మల మర్రి అనే పాట పాడారు. అది కూడా గూడ అంజయ్య అనే రచయత రాసిన పాట. త‌ర్వాత ఆయ‌న సినిమా తెర‌పై క‌నిపించింది  జై బోలో తెలంగాణ‌లో పొడుస్తున్న పొద్దు మీద అనే పాట ద్వారా మాత్ర‌మే. ఆయ‌న‌కూ సినిమాల‌కూ ఉన్న సంబంధం   చాలా చాలా బ‌ల‌హీన‌మైన‌ది. అయితే ఇక్క‌డ ఆస్కార్ కి గ‌ద్ద‌ర్ కీ ఉన్న పోలిక ఏంటంటే.. ఈ రెండు అవార్డులూ.. వ్య‌క్తుల పేర్ల‌కు సంబంధించిన‌వి. ఇక్క‌డ గ‌ద్ద‌ర్ అవార్డే ఆస్కార్ క‌న్నా ఒకందుకు గొప్ప‌. అదెలాగంటే అస‌లు ఆస్కార్ కీ  సినిమాల‌కూ సంబంధమే లేదు. 

కార‌ణం..  1939లో హాలీవుడ్ సినిమాల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉత్త‌మ సినిమాల‌కి అకాడ‌మీ అవార్డులు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. అయితే ఈ స‌మ‌యంలో ఒక అవార్డు రూపు త‌యారు చేయాల‌ని ట్రై చేశారు. శిల్పి జార్జి స్టాన్లీ 13 అంగుళాల ఎత్తు, ఎనిమిదిన్న‌ర పౌండ్ల బ‌రువుతో దీన్ని త‌యారు చేశారు. ఈ ఆస్కార్ రూపానికి ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడ‌మీ అవార్డులు అందించే ఐదు ప్ర‌ధాన విభాగాల‌ను సూచిస్తుందిది. ఇదిలా ఉంటే ఈ సంస్థ‌లో ప‌ని చేసే మార్గ‌రెట్ హెరిక్ అనే మ‌హిళ‌.. విజేత‌ల‌కు అందించే ఈ బొమ్మ‌ను చూసి.. ఇది అచ్చం మా అంకుల్ ఆస్కార్ లా  ఉంద‌ని అన‌డంతో.. ఈ అకాడ‌మీ అవార్డుల‌కు ఇచ్చే రూపానికి   ఆస్కార్ అవార్డ్ గా పేరొచ్చింద‌ని అంటారు.

దీంతో పోలిస్తే గ‌ద్ద‌ర్ పేరు పెట్ట‌డంలో ఏమంత త‌ప్పు లేద‌న్న‌ది కొంద‌రి వాద‌న‌. ఇదిలా ఉంటే.. మ‌రికొంద‌రు అవార్డు రూపంలో ఒక ఆస్కార్ లా.. గ‌ద్ద‌ర్ రూపం లేకుండా ఆయ‌న చేతిలోని డ‌ప్పును మాత్ర‌మే పెట్ట‌డమేంట‌న్న మాట వినిపిస్తోంది. గ‌ద్ద‌ర్ కి ఇటీవ‌ల క‌ట్టిన విగ్ర‌హం న‌మూనాలో.. ఈ అవార్డు రూపం కూడా ఉంటే బాగుండేద‌న్న మాట వినిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu