చంద్రబాబు రికార్డు బద్దలు కొట్టిన చంద్రశేఖరరావు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రికార్డును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బద్దలు కొట్టేశారు. ఇంతకీ ఆ రికార్డు  ఏమిటంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన పదేళ్ల కాలం కలుపుకుంటే తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కాలం  ఏకథాటిగా ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు శుక్రవారం ( జూన్ 2) వరకూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి పేరిట ఉంది.

అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన రోజుతో ఆయన రికార్డు బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రి గా  చంద్రబాబు ను వెనక్కు నెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వచ్చారు.

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబర్ 1 నుంచి ఏకధాటిగా   8 ఏళ్ల 256 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికి అదే రికార్డు. ఆ రికార్డు ఇప్పటి వరకూ అంటూ జూన్ 2, 2023 వరకూ పదిలంగా ఉంది. అయితే రాష్ట్ర విభజన తరువాత   తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఏకధాటిగా తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు రికార్డు చెరిగిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu