ప్రతి పక్ష కూటమికి బీఆర్ఎస్ దూరం  

జూన్ 12న బిజెపి యేతర పార్టీలు పెట్టబోయే మీటింగ్ లో బీఆర్ఎస్ గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి బిజెపి ప్రభుత్వం ఆహ్వానించకుండా రాష్ట్రపతిని అవమానించినట్లు ప్రతి పక్షాలు ఆరోపించాయి.

ప్రతి పక్షాలు చేసిన నిరసన కార్యక్రమాల్లో కెసీఆర్ పాల్గొనలేదు.  కూతురు కవిత ఢిల్లీ మద్యం కేసులో చిక్కుకుపోవడంతో కెసీఆర్ తన స్ట్రాటజీ మార్చినట్లు కనబడుతోంది. బిజెపితో మెతక వైఖరి కనిపిస్తోంది. ఇరు పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతి పక్షాలు  కూడా కెసీఆర్ ను కలుపుకోవడం లేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ కోసం కెసీఆర్  కాళ్లకు చక్రాలు కట్టుకుని బొంగరంలా తిరిగారు. ప్రతి పక్షాలను ఏకం చేసే కార్యక్రమాలు భుజాన వేసుకున్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కేవలం కాంగ్రెస్ కు మాత్రమే కెసీఆర్ వ్యతిరేకి. బిజెపితో కేసీఆర్ కు శత్రుత్వం లేదు. కర్ణాటక ఫలితాల తర్వాత కెసీఆర్ బిజెపిని కాకుండా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వం వహించే ప్రతి పక్ష కూటమి జూన్ 12న బీహార్ పాట్నాలో సమావేశమవుతుంది. కాంగ్రెస్ గొడుగు క్రింద కెసీఆర్ ఉండటం ఇష్టం లేక ఈ కూటమిలో కలవడం లేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోఆర్డినేషన్ లో ఈ కూటమి సమావేశమవుతుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో ఉన్నారు. 12 సమావేశానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. బిజెపి ప్రభుత్వాన్ని తూర్పార బట్టడానికి  కూటమి సమావేశాలను ఇక నుంచి వరుసగా నిర్వహించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. 

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu