చంద్రబాబు, కేసీఆర్.. ఇద్దరి ఫొటోలు తొలగించారు
posted on Oct 6, 2015 11:23AM

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గొడవలు ఇక్కడ చాలవన్నట్టు ఢిల్లీలో కూడా మొదలుపెట్టారు. ఢిల్లీలోని ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి గురజాడ సమావేశ మందిరం ఉమ్మడిగా కొనసాగుతుంది. అయితే ఈ మందిరంలో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ల ఫొటోలను మందిరం అధికారులు పెట్టారు. అయితే నిన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ జర్నలిస్టు అసోసియేషన్ (ఢిల్లీ శాఖ)ను ప్రారంభించడానికి గురజాడ సమావేశ మందిరానికి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవడానికి ముందు ఇద్దరు సీఎంల ఫొటోలలో కేసీఆర్ ఫొటో తీసేసి చంద్రబాబు ఫొటో ఉంచారు. అంతే దీనిని గమనించిన తెలంగాణ జర్నలిస్ట్ వెంటనే దీనిని తెలంగాణ భవన్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మెహన్ కు తెలుపగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురజాడ సమావేశ మందిరానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిబ్బందిని నిలదీశారు. ఉంటే ఇద్దరు సీఎంల ఫొటోలు ఉండాలి లేకపోతే ఇద్దరివి తీసేయాలి.. అంతేకాని కేసీఆర్ ది తీసేసి చంద్రబాబుది ఉంచడం ఏంటని మండిపడ్డారు. దీంతో చంద్రబాబు ఫొటోని కూడా తీసేశారు. అయితే చంద్రబాబు కార్యక్రమానికి వచ్చి వెళ్లిన తరువాత కూడా ఫొటోలు పెట్టకపోవడం గమనార్హం.
.