దళిత సోదరుడు సింగయ్యది జగన్ చేసిన హత్యే : సోమిరెడ్డి
posted on Jun 25, 2025 3:54PM

దళిత సోదరుడు సింగయ్యను హత్య చేసింది మాజీ సీఎం జగనేని టీడీపీ నేత మాజీ మంత్రి,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా 9 గంటలు వేల మందితో ర్యాలీ చేశారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హచయాంలో దళితులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని తెలిపారు. సింగయ్య మృతిని జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్ పేరు తీసేసి రప్ప...రప్ప పార్టీ అని పెట్టుకో పార్టీ అని పెట్టుకోవాలని సూచించారు. ర్యాలీలో కాన్వాయ్ కింద పడితే తొక్కేసి వెళ్లిపోయారని విమర్శించారు.
కనీసం దిగి బాధితుడిని ఆస్పత్రికి కూడా తరలించలేదని, సింగయ్యది ముమ్మాటికీ హత్యని సోమిరెడ్డి ఆరోపించారు.తీవ్రంగా గాయపడిన సింగయ్యను ముళ్లకంపల్లో పడేసి వెళ్ళిపోతారా.. అంటూ జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాంటి వారి వల్ల దళితులు, గిరిజనుల ప్రాణాలకు హానీ కలుగుతోందన్నారు. ఈ దేశ చరిత్రలో రూ. 43 వేల కోట్ల కుంభకోణంలో జగన్ నిందితుడని సోమిరెడ్డి అన్నారు. జగన్ పర్యటనలో 679 మంది పోలీసులను పెడితే ఇంకా బందోబస్తు సరిపోలేదని విమర్శలు చేస్తున్నారని, 90 కిలోమీటర్ల రోప్ పార్టీని పెట్టాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.
జగన్‌కు సిగ్గూ శరం ఉండాలన్నారు. జగన్ కోసం వచ్చిన అభిమానిని నిలువునా ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు. ఆయన కారులో ఉన్న పెద్దరెడ్డి కారు కింద పడితే అలాగే వదిలేసి వెళుతారా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో ముగ్గురు చనిపోయారని, జగన్ తీసుకున్న అనుమతి ఒకటి.. చేసింది మరొకటని విమర్శించారు. గత వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎంత అవినీతి చేయోచ్చో.. ఏపీ లిక్కర్ స్కామ్ చూస్తే అర్థమవుతోందని సోమిరెడ్డి తెలిపారు.