జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత?
posted on Sep 10, 2025 2:58PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు ముగిసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాగంటి గోపానాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవశం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఎవరిని ఎన్నిక చేయాలన్న విషయంపై మల్లగుల్లాలు పడింది. పలువురి పేర్లు పరిశీలించింది.
అయితే తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు భేటీ అయ్యారు. ఆ భేటీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక.. అభ్యర్థి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గ కార్యకర్తల అభిష్టం మేరకు కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నకకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.