ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటోలపై పిల్... డిస్మిస్ చేసిన హైకోర్టు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది.   ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.  ప్రభుత్వ కార్యాలయాలలో డిప్యూటీ సీఎం ఫొటోలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను బుధవారం (సెప్టెంబర్ 8) విచారించిన హైకోర్టు..  గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉప ముఖ్యమంత్రి  ఫొటో పెట్టకూడదని చెప్పేందుకు చట్టపరమైన నిబంధనలు ఎక్కడ ఉన్నాయని  పిటిషనర్‌ను ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. 

ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటో ప్రదర్శనకు చట్టబద్ధమైన అనుమతులు లేవని, దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం రూపొందించే వరకు ఆ ఫొటోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని రైల్వే విశ్రాంత ఉద్యోగి  కొండలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు నిజమైన ప్రజా ప్రయోజనాలు ఉన్న వ్యాజ్యాలను మాత్రమే న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటాయని పేర్కొంది. రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికి కోర్టులను ఒక వేదికగా మార్చుకోవడం సరైన స్పష్టం చేసింది.  అనవసర వ్యాజ్యాలతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని సూచిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu