విభజనపై భ్రమలు తొలగాయి

 

రాష్ట్ర విభజన విషయంలో ప్రజల్లో నెలకొన్న భ్రమలు తొలగిపోయాయని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆయన కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని, పరిస్థితి ఇలాగే వుంటే మళ్ళీ రెండు రాష్ట్రాల్లోనూ సమైక్య ఉద్యమం రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా వుంటే, తెలంగాణ శాసనసభలో బడ్జెట్ మీద ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ అహంకారంతో మాట్లాడటం సరికాదని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu