ఎర్రబెల్లి అరెస్ట్
posted on Nov 14, 2014 1:23PM

వరంగల్ జిల్లా జనగామలో తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా జనగామలో శుక్రవారం నాడు తెలుగుదేశం కార్యకర్తలు ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఎర్రబెల్లి దయాకరరావుతోపాటు పలువురు తెలుగుదేశం కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెలుగుదేశం శాసనసభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసింది. రైతుల ఆత్మహత్యలు, పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం మేము ప్రభుత్వాన్ని నిలదీస్తే సస్పెండ్ చేయడం బాధాకరం. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగట్టడానికే తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టాం. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మమ్మల్ని ఆంగ్లో ఇండియన్స్ అని, ఆంధ్రా తొత్తులు అని అభివర్ణించడం దారుణం. ప్రభుత్వ అవినీతిని ప్రజా క్షేత్రంలోనే ఎండగడతాం’’ అన్నారు.