హోదా కోసం కాలర్ పట్టుకుంటానని.. కేసుల కోసం కాళ్లు పట్టుకుంటున్నారు..రఘురామరాజు

అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న సామెత సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. త్యేక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వ కాలర్ పట్టుకుని నిలదీస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కేసుల నుంచి బయటపడేయమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకుంటున్నారు. అర్థరాత్రి భేటీలలో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ మాటలు ఎవరో కాదు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సీఎం జగన్ను ఉద్దేశించి అన్నారు.

శుక్రవారం (మార్చి 31) రచ్చబండలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై సెటైర్లు వేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉత్తరకుమారుడిగా అభివర్ణించిన జగన్ ఇప్పుడు తాను స్వయంగా  ఉత్త కుమారుడిగా మిగిలిపోయారని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ఈ నాలుగేళ్లలో పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు ఏనాడూ గళమెత్తలేదన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం , రైల్వే జోన్ సాధన కోసం ఏనాడు ఆందోళన నిర్వహించని వారు, తనని అనర్హుడిగా ప్రకటించాలని మాత్రం పార్లమెంట్లో ప్ల కార్డులు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారని ఎద్దేవా చేశారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అర్ధరాత్రి చేసిన మంతనాలు రాష్ట్రం గురించే అంటే జనం నమ్మరన్నారు.  

జగన్ అమిత్ షాతో భేటీ అయిన రోజే  సుప్రీం కోర్టు తీర్పు ద్వారా కాసింత వెసులుబాటు లభించింది. అయితే  15 రోజుల వ్యవధిలో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు సిబిఐ పేర్కొంది. అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేసేటప్పుడు, అడిషనల్ అరెస్టులు కూడా ఉంటాయి. ఆ అడిషనల్ అరెస్టులు ఏమిటో ఇప్పటికే సిబిఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఇప్పుడు ఆ పేర్ల గురించి చర్చ ఎందుకని రఘురామ నర్మగర్భంగా అన్నారు.  అంత హడావుడిగా పది హేను రోజుల వ్యవధిలో హస్తిన వెళ్లిన ప్రధాని ప్రధాని అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా 16వ తేదీన హైకోర్టులో తీర్పు వెలువడడం, మళ్లీ ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగానే సుప్రీంకోర్టులో విచారణ అధికారి రాంసింగ్ ను తొలగించాలని ఉత్తర్వులు వెలువడడం వంటి సంఘటనలను పరిశీలిస్తే , ప్రజలు అనుమానించినట్లుగానే జరుగుతోందేమోనని రఘురామకృష్ణం రాజు సందేహం వ్యక్తం చేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu