ఐపీఎల్ సీజన్ 16.. తొలి మ్యాచ్ లో చెన్నైపై గుజరాత్ విజయం

ఐపీఎల్ సీజన్ 16లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ ఐపీఎల్ సీజన్ కు ఈ మ్యాచ్ సరైన ఆరంభాన్ని ఇచ్చింది. అత్యంత ఉత్కంఠభరితంగా చివరి ఓవర్ వరకూ సాగిన తొలి మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి 92 పరుగులు చేశారు. ఇక 179 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి  ఛేదించి ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.

 గిల్  63  పరుగుల చేశాడు.  విజయ్ శంకర్  27 పరుగులతో రాణించాడు.   చివరి ఓవర్‌లో విజయానికి ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా.. తైవాటియా వరుసగా సిక్స్, ఫోర్ బాది జట్టును గెలిపించాడు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu