తప్పెవరిది? మీడియాదా? మీదా?

జగన సార్..జర సోచోనా...
‘మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు’ అన్నట్లుంది, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో  రగిలిపోతున్నారు. రోడ్డెక్కు తున్నారు. అయినా, ఆ వార్తలు ఏవీ పత్రికలో రారాదుట. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీకురాడం నేర మువుతుందన్నట్లుగా భావిస్తున్నారో ఏమో కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా మీద మరోమారు మండి పడ్డారు. కొని వార్తా పత్రికలను, మీడియా సంస్థలను పేరుపెట్టి మరీ తప్పు పడ్డారు. ఒకప్పుడు వైఎస్సార్. ‘ఆ రెండు పత్రికలు’ అంటూ దూషించిన ఈనాడు, ఆంద్ర జ్యోతి పత్రికలు, టీవీ 5 చానల్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాందోళనలకు సంబదించిన వార్తలను ప్రముఖంగా ప్రచురించి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించాయి. అంతే కాదు, విపక్షాలతో చేతులు కలిపి ఆందోళనలను, సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి అసహనం వ్యక్త పరిచారు.

నిజానికి, ప్రతిపక్ష పాత్రను పోషించడమే పత్రికలు, మీడియా కర్తవ్యం. పత్రికలు.మీడియా ఉండేదే ప్రభుత్వం తప్పులను, ప్రతిపక్షాల అసమర్ధతను, సమాజంలో చోటు చేసుకుంటున్న డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా వంటి సంఘ వ్యతిరేక శక్తుల ఆకృత్యాలను, నేరాలు ఎత్తి చూపేందుకు. అంతేకాదు, ముఖ్యమంత్రి ఆరోపించినట్లుగా పత్రికలు మీడియా, ప్రజలను జాగృత పరిచి ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళనలను  నిర్మించగలిగితే, అది స్వాగతించ వలసిన పరిణామమే అవుతుంది కానీ,నేరం కాదు.  

కానీ, ముఖ్యమంత్రి, అది నేరమే అంటున్నారు. ఆశావర్కర్ల ఆందోళనలు.. నిరుద్యోగుల ధర్నాలు.. టీచర్ల నిరసనలు వంటి వార్తలను వార్తలుగా చూడడమే నేరమని జగన్ రెడ్డి తేల్చేశారు. ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరని, ప్రస్తుత ప్రతిపక్షం మళ్ళీ అధికాంలోకి  రావాలని   కోరుకునే వారే, ఆందోళనలు కోరుకుంటారని అంటున్నారు.

అదే క్రమంలో జగన్ రెడ్డి  జనసేన అధినేత పవన్ కల్యాణ్’ను, కమ్యూనిస్టులను కూడా ప్రధాన ప్రతిపక్షం గాటన కట్టేశారు. తెలుగు దేశం పార్టీ ప్రోద్బలంతోనే జనసేన,వామపక్ష పార్టీలు,వాటి  అనుబంధ సంఘాలు ఆందోళన చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం పైకి వారినీ, వీరిని రెచ్చగొట్టాలని టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల భవిష్యత్ ఏమిటని జగన్ ప్రశ్నించారు.

నిజానికి, సమస్యలు లేకుంటే, పత్రికలు ఎంత మొత్తుకున్నా, జనం రోడ్ల మీదకు రారు .. అలాగే, సమస్య నిజంగా ఉన్నప్పుడు, ఇంటిటికీ కరపత్రాలు పంచినా, పంతులకో పోలీసును కాపలా పెట్టినా, రవాణా సదుపాయాలు లేకుండా చేసినా, ఇంకా ఎన్నిఅవరోధాలు సృష్టించినా, బాధిత వర్గాలు రోడ్డు మీదకు వస్తాయి, కదం తొక్కుతాయి. చలో విజయవాడ చెప్పిన సత్యం ఇదే ..ఇది ఎవరైనా అంగీకరించి తీరవలసిన నిజం. కాదని, కళ్ళు ఎర్ర్ర చేసినా, కలాలకు సంకెళ్ళు వేసినా, ఫలితం ఉండదని జగన్ రెడ్డి ఎంత త్వరగా ఈ నిజాన్ని గ్రహిస్తే అంత మంచిదని, ముందు ప్రభుత్వం తమ తప్పులు తెలుసుకుని చక్కదిద్దుకోవడం అవసరమని, పరిశీలకులు, విజ్ఞులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu