ప్రధాని మోదీ మాటకారా? మోసకారా?

నరేంద్ర మోదీ.. తన చిన్నతంలో చాయ్ అమ్మాడో లేదో కానీ.. ఓ దేశ ప్రధానిగా ఆయన మాటల గారడీతో  భారతీయులను టోకుగా బేకారులుగా చేస్తున్నాడనేది మాత్రం సుస్పష్టం. 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలో కూడా అగ్రస్థానంలో ఉండేది. కానీ రాష్ట్ర విభజన అనే ఒక్క ఒక్క దెబ్బతో అటు ఆంధ్రప్రదేశ్... ఇటు తెలంగాణలకు పెద్ద దెబ్బే తగిలింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు తగిలిన దెబ్బ బయటకు కనిపిస్తోంది. కానీ తెలంగాణకు తగిలిన దెబ్బ మత్రం కౌకు దెబ్బగా మిగిలిపోయింది. 

రాష్ట్ర విభజన జరిగి దాదాపు దశాబ్దం కావోస్తున్నా.. నేటికీ విభజన తాలుక దెబ్బ ఇంకా పచ్చిగానే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి. సదరు రాష్ట్రం గురించి చర్చించుకుంటే మాత్రం గుండె తరుక్కుపోతోంది. విభజన నాటి సమయంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో.. నేటికి అవే సమస్యలు అలాగే ఉండడం గమనార్హం. నాటి నుంచి నేటి వరకు ఒక్క సమస్య కూడా తీరింది లేదు. 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో.. రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారు. దీనిపై నాడు సర్వత్రా విమర్శలు వెల్లువత్తాయి. తాజాగా బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై ప్రధాని మోదీ ప్రజాస్వామ దేశంలో దేవాలయం లాంటి పార్లమెంట్‌ సాక్షిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. హస్తం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు చోటు చేసుకున్న.. చేసుకోంటున్న ఆటు పోట్లను సైతం ఆయన విపులీకరించారు. 

అయితే ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ... మోదీ ఇలాంటి అంశాలను తెరపైకీ తీసుకు వచ్చి.. కాంగ్రెస్ పార్టీని బదనాం చేసి తాను లబ్ది పొందే కార్యక్రమంలో ఇది ఒక భాగం అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చేసి.. రాజకీయంగా.. పార్టీ పరంగా... తాను, తన పార్టీ పబ్బం గడుపుకోవడం కోసం ఇలాంటి ఎత్తులు వేసే సత్తా ఈ గుజరాతీ బాబు సొంతమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 

ప్రధాని హోదాలో ఉన్న మోదీ తెలుగు రాష్ట్రానికి ఎంత చేయాలో అంత చేయవచ్చు.. ఆ ఆవకాశం దేశ ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. కానీ మోదీ ఏమీ చేయడనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయింది. దేశంలో ఎక్కడ ఎన్నికల ఉన్నా.. సమయం సందర్భం చూసి మరీ రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రధాని మోదీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని పలువురు పేర్కొంటారు. అందుకు పార్లమెంట్‌ అయినా.. దేశంలోని వివిధ ఎన్నికల ప్రచార సభలు అయినా వేదికగా చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడం ప్రధాని మోదీ రివాజు అనే చర్చ అయితే దేశ వ్యాప్తంగా నడుస్తోంది. విభజన తర్వాత తెలుగు రాష్టాల మధ్య పరిస్థితులు ఉప్పు నిప్పుగా మారాయి. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేని రాష్ట్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం ఏం జరుగుతుందో మోదీ ఓ కంట కనిపెడుతూనే ఉంటారనే టాక్ అయితే కమలం పార్టీలోనే గుంభనంగా ఉంది.

మరి ఆంధ్రప్రదేశ్‌కు మంచి చేయాలంటే.. ప్రధాని మోదీకి మనస్సు రావాలా? లేక సదరు రాష్ట్ర ప్రజలకు కాలం కలిసి రావాలా? లేక ఇంకేదైనా అద్భుతం జరగాలా? అనే సందేహంలో సగటు తెలుగు మానవుడు ఉన్నాడు. పార్లమెంట్ సాక్షిగా తాజాగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఓ అనుమానం అయితే మెదులుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానిగా అత్యున్నత హోదాలో ఉన్న నరేంద్ర మోదీ.. మాటకారా ? మోసకారా?  లేక మాటకారి ప్లస్ మోసకారి కూడానా అనే చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో బలంగా నడుస్తోంది. మరి ప్రజల మనస్సులో ఉన్న సందేహాన్ని తీర్చాలంటే.. మాత్రం విజభనతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు మోదీ అంతో ఇంతో ఏదైనా చేయాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu