రిమాండ్ పొడిగింపు కోసం నేడు సిబిఐ కోర్టుకు జగన్ ?
posted on Dec 5, 2012 11:08AM

అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, మోపిదేవి వెంకట రమణా రావు, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి లను సిబిఐ అధికారులు నేడు హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో హాజరు పరచనున్నారు. వీరందరి రిమాండ్ నేటితో ముగియనున్న నేపధ్యంలో రిమాండ్ పొడిగింపు కోసం వీరిని సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు.
సిబిఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి సెలవులో ఉన్నందున వీరందరీని రెండో అదనపు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరు పరుస్తారు. చంచల్ గూడ జైలు నుండి వీరిని కోర్టుకు తీసుకురానున్న నేపధ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మరో వైపు రిమాండ్ పూర్తయిన నేపధ్యంలో ఓఎంసి కేసులో నిందితునిగా ఉన్న గాలి జనార్ధన రెడ్డి ని కూడా కోర్టులో హాజరు పరచగా, కోర్టు గాలికి ఈ నెల 19 వరకూ రిమాండ్ ను పొడిగించింది.