నార్వే దంపతులకు జైలు..కన్నీరు కార్చిన తల్లిదండ్రులు
posted on Dec 4, 2012 3:15PM

కుమారుడిని హింసించారని ఆరోపణలు ఎదుర్కొంటు నార్వేలో అరెస్ట్ అయిన ప్రవాసాంధ్ర దంపతులు వల్లభననేని చంద్రశేఖర్, అనుపమ దంపతులకు శిక్ష ఖరారైంది. ఓస్లోలోని జిల్లా కోర్టు చంద్రశేఖర్కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు శిక్ష విధించింది. గత నెల 23 నుంచి వీరిద్దరూ నార్వే పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. శిక్ష ఖరారు కావటంతో చంద్రశేఖర్, అనుపమల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రోదించారు.
నార్వేలో పనిచేస్తున్న వీరు తమ కుమారుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండడంతో హెచ్చరించారు. దీంతో తన తల్లిదండ్రులు తనను భారత్ పంపిస్తామని అన్నారు చదువుతున్న పాఠశాలలో చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి చట్టాల ప్రకారం అది నేరం కావడంతో ఇది పెద్ద తప్పిదం. అయితే దీనిమీద నార్వేతో చర్చలు జరపాలని డిమాండ్ వచ్చింది. అయితే మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు సరైన రీతిలో కేంద్రంపై వత్తిడి తెస్తే శిక్ష తప్పేదేమో.