జగన్ సెల్ఫ్ గోల్ అయ్యాడా..?
posted on May 11, 2017 6:06PM
.jpeg.jpg)
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు తెలిసి తీసుకుంటాడా..? లేక తెలియక తీసుకుంటాడా అన్న అనుమానాలు వస్తుంటాయి. ఎందుకంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.. త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవికాలం ముగియనుండటంతో ఆ పదవికి ఎన్నిక జరగనుంది. దీంతో పార్టీలన్నీ ఇప్పటినుండే ఎవరి ప్లాన్లు వాళ్లు వేసుకుంటున్నారు. బీజేపీ ఎలాగైనా సరే వాళ్ల అభ్యర్ధిని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తుండగా..అటు కాంగ్రెస్ కూడా బీజేపీ అభ్యర్ధిని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఏ పార్టీ బీజేపీకీ మద్దతు పలుకుతుంది... ఏపార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంది అని రాజకీయ విశ్లేషకులు కాలిక్లేషన్స్ కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఏం చేస్తాడా..? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు.
అయితే అందరికీ షాకిస్తూ జగన్ తమ మద్దతు బీజేపీకే ఉంటుందని చెప్పాడు. చాలా రోజుల తరువాత ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్న జగన్ కు ఫైనల్లీ అపాయింట్ మెంట్ దొరికింది. దీంతో మోడీతో భేటీ అయిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు బీజేపీకే అని తేల్చిచెప్పేశాడు. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికకు ఎవరైనా పోటీ పెట్టాలంటే అది తప్పు, ఎన్డీఏ వద్ద తగినంత సంఖ్యాబలం ఉందని, వాళ్లే గెలుస్తారని, ఎలాగు ఓడిపోతామన్నప్పుడు పోటీ పెట్టడం మంచిది కాదన్నారు. రాష్ట్రపతిలాంటి పెద్ద పదవికి పోటీ లేకుండానే ఎంపిక జరగాలి.. ఒక్క ప్రత్యేక హోదా అంశంతో తప్ప బీజేపీతో మాకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు..బీజేపీ అభ్యర్ధికే మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఇంకా ప్రత్యేక హోదా గురించి కూడా మోడీతో చర్చించినట్టు.. బీజేపీ నేతలు మాట ఇచ్చిన ప్రకారం.. తిరుమలలో మీరు మాట ఇచ్చిన ప్రకారం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరామని చెప్పారు.
ఇక్కడే జగన్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే వైసీపీ పార్టీకి మిగిలిన వారికంటే మైనార్టీ మెజారిటీ ఎక్కువ అని అందరికీ తెలిసిందే. మైనార్టీల నుండి బీజేపీకి అంతగా సపోర్ట్ ఉండదన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి జగన్ ఇంత హ్యాపీగా బీజేపీకే తమ మద్దతు అని తెలుపుతున్నా అతనికి సపోర్టుగా నిలిచిన మైనార్టీలు బీజేపీకి సపోర్ట్ ఇస్తారా..? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అసలు జగన్ బీజేపీ కి సపోర్ట్ ఇవ్వడం పక్కన పెడితే... జగన్ నిర్ణయంతో ఉన్న మైనార్టీ మెజార్టీ కాస్త దూరమవుతుందా అని చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈ నిర్ణయంతో జగన్ సెల్ఫ్ గోల్ తీసుకున్నాడని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి ఏ రాయి అయితే ఏంటి పళ్లు రాలగొట్టుకోవడానికి అన్న సామెత ప్రకారం...అటు బీజేపీకి సపోర్టు ఇచ్చినా ప్రాబ్లం ఉంటుంది.. ఇవ్వకున్నా ప్రాబ్లం ఉంటుంది అని సపోర్ట్ ఇచ్చినట్టున్నాడు జగన్. మరి చూద్దాం జగన్ బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు... బీజేపీ జగన్ కు ఎంతవరకూ సపోర్ట్ ఇస్తుందో..!